జీవితంపై విరక్తి.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సంచలన నిర్ణయం..
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలతో నటించి, మెప్పించింది. 1990లో తన అందంతో కుర్రకారు మతి పొగొట్టింది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించింది. కానీ, సడెన్ గా పలు వివాదాల్లో ఈ అమ్మడు చిక్కుకుంది. దీంతో ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. దాదాపు 25 సంవత్సరాల తరువాత ఇండియాకు వచ్చింది. మళ్లీ సినిమాల్లో నటిస్తోంది కావచ్చని తన ఫ్యాన్స్ భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా .. ఆ స్టార్ హీరోయిన్ సన్యాసం తీసుకుంది. ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్న హీరోయిన్ ఎవరంటే?
ఆ హీరోయిన్ ఎవరో కాదు. బాలీవుడ్ భామ మమత కులకర్ణి.. హీరోయిన్ తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళంతో పాటు బెంగాళీ చిత్రాల్లో కూడా నటించింది. దాదాపు బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరి సరసన నటించారు. 1990లో తన అందంతో కుర్రకారు మతి పొగొట్టింది ఈ అమ్మడు. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తూనే ఒక్కసారిగా కనుమరుగయ్యారు. 2016లో పలు వివాదాల్లో ఈ అమ్మడు చిక్కుకుంది. దీంతో ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయింది మమత.

90లో స్టార్ హీరోయిన్‌గా రాణించిన మమత కులకర్ణి తెలుగులో హీరో ప్రశాంత్ 'ప్రేమ శిఖరం' సినిమాలో నటించింది. ఇది ఈ అమ్మడు తొలి తెలుగు సినిమా. ఆ తరువాత మోహన్ బాబు సరసన 'దొంగ పోలీస్', 'బ్రహ్మ' వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అలాగే.. బాలీవుడ్ లో కూడా పలువురు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అలా.. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, సైఫ్ అలీఖాన్, అజయ్ దేవగణ్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసింది మమతా కులకర్ణి.
తన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే.. ఓ ఎన్‌ఆర్‌ఐని పెళ్లి చేసుకుని అమెరికాలో సెట్ అయింది. కానీ, వారి మధ్య వివాదాలు రావడంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత అంతర్జాతీయ డ్రగ్స్ డీలర్ విక్కీ గోస్వామిని వివాహం చేసుకున్నట్టు టాక్. కానీ, ఈ విషయంలో క్లారిటీ లేదు. కానీ, 2016లో విక్కీ గోస్వామి అరెస్ట్ తర్వాత మమత అమెరికా డ్రగ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (DEA) స్కానర్ కిందకు వచ్చింది. దీంతో మమతా కులకర్ణిని డీఈఏ వాంటెడ్‌గా ట్యాగ్ చేసింది.

మమతా కులకర్ణి డిసెంబర్ 2024లో ఒక వీడియోను షేర్ చేసింది. తాను 25 సంవత్సరాల తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చానని చెప్పింది. ఈ అమ్మడు ముంబైలో ఉంటుంది. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ మమత కులకర్ణి (Mamta Kulkarni) సన్యాసం తీసుకుని షాక్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో పాల్గొని తాను సన్యాసం తీసుకున్నట్టు, తనని తాను మహామండలేశ్వర్‌గా మారుతున్నట్లు ప్రకటించింది. తాను అన్ని విడిచి ఆధ్యాత్మిక బాటలో ప్రయాణించబోతున్నట్లు ప్రకటించింది.
హీరోయిన్ మమత కులకర్ణి జనవరి 24న కిన్నార్ అఖారాలో ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీ నారాయణ త్రిపాఠి సమక్షంలో సన్యాస దీక్ష తీసుకుంది. హీరోయిన్ తన పేరును శ్రీ యామై మమత నందగిరిగా మార్చుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం హీరోయిన్ మమత కులకర్ణి కాషాయ దుస్తులు ధరించి, మెడలో రుద్రాక్షతో దర్శనమిస్తుంది. 25 ఏళ్ల తర్వాత ఇండియా వచ్చింది సాధ్విగా మారడానికిగా అంటూ తన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.


Click it and Unblock the Notifications











