వైవాహిక జీవితానికి బాలీవుడ్ హీరోయిన్ గుడ్ బై.. ఐదేళ్ల కాపురం తర్వాత భర్తతో బ్రేకప్
బాలీవుడ్‌లో మరో హీరోయిన్ వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. ప్రేమించి పెళ్లి చేసుకొన్న మినిషా లాంబా, ర్యాన్ థామ్ అధికారికంగా విడాకులు తీసుకొన్నారు. మంగళవారం తన విడాకుల విషయాన్ని అధికారికంగా మీడియాకు వెల్లడించారు. తాము విడాకులు తీసుకోవడానికి కారణాలు వెల్లడిస్తూ మీడియాలో ఓ ప్రకటన చేశారు. మినిషా లాంబా డేటింగ్, పెళ్లి, విడాకుల గురించి మరిన్ని వివరాలు..

తొలిసారి నైట్ క్లబ్‌లో
హీరోయిన్ మినీషా లాంబా, ర్యాన్ థామ్ తొలిసారి ఓ రెస్టారెంట్‌లోని నైట్ క్లబ్‌లో కలుసుకొన్నారు. తనతో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నిస్తే నన్ను దూరం పెట్టారు. ఆ తర్వాత నా స్నేహితుల ఇంట్లో కలిసి మా భావాలను పంచుకొన్నాం. ర్యాన్ ప్రేమ విషయంలో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అవునో కాదో చెప్పలేను. తొలిసారి ఆయనను చూసినప్పుడు చాలా ఇష్టపడ్డాన అని మినీషా లాంబా తెలిపారు.

2015లో నిరాడంబరంగా పెళ్లి
మా మధ్య బంధంలో సానుకూలత ఏర్పడటంతో మేమిద్దరం కొన్ని నెలలపాటు డేటింగ్ చేశాం. ఆ తర్వాత మా ప్రేమపై మాకు పూర్తిగా నమ్మకం కలగడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నాం. 2015లో నిరాడంబరంగా అతి కొద్ది మంది స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య మా వివాహం జరిగింది అని తెలిపారు. ఈ పెళ్లిలో కీలక వ్యక్తిగా వ్యవహరించిన పూజా బేడీ.. మినీషా లాంబా పెళ్లి విషయాన్ని వెల్లడించడం ద్వారా మీడియా ప్రపంచానికి తెలిసింది.

ఐదేళ్ల వివాహ బంధానికి ముగింపు
సుమారు ఐదేళ్లపాటు మా మధ్య వివాహ బంధం కొనసాగింది. దాంపత్య జీవితంలో మా ఇద్దరి మధ్య అనేక అభిప్రాయ బేధాలు తలెత్తాయి. వాటిని పరిష్కరించుకొనేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దాంతో విడాకులు తీసుకోవాలని కోర్టులో పిటిషన్ వేశాం. కోర్టు మా అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని మాకు విడాకులు జారీ చేసింది అని మినీషా లాంబా చెప్పారు.

మా మధ్య అభిప్రాయ బేధాలే.. ద్వేషాలు లేవు
ర్యాన్ థామ్ నేను పరస్పర అంగీకారంతోనే విడిపోయాం. మా మధ్య ఎలాంటి ద్వేషాలు లేవు. ఓసారి కలిసి జీవించలేమని నిర్ణయించుకొన్న తర్వాతే విడిపోవాలని నిర్ణయించుకొన్నాం. వివాహ పరంగా విడిపోయినప్పటికీ, మా మధ్య కామన్ రిలేషన్ అలానే ఉన్నాయి. మేమిద్దరం ఫ్రెండ్స్‌గా ఉండాలని నిర్ణయించుకొన్నాం అని మినీషా లాంబా తెలిపారు.

మినీషా లాంబా కెరీర్ అలా
2005లో మినీషా లాంబా బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. షుజిత్ సర్కార్ దర్శకత్వం వహించిిన యహాన్ చిత్రం ద్వారా హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత హానీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్, బచ్‌నా యే హసీనో, వెల్ డన్ అబ్బా, బేజా ఫ్రై 2 చిత్రాల్లో నటించారు. 2011 తర్వాత ఆమె బాలీవుడ్ చిత్రాల్లో ఎక్కువ కనిపించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం మళ్లీ కెరీర్‌ను చక్కదిద్దుకొనే ప్రయత్నంలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











