ఆ 9 రోజులు రాత్రిపగలు అదొక్కటే.. బాలీవుడ్ హీరోయిన్ సీక్రెట్

బాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ త్వరలో తెలుగు సినిమాతో ప్రేక్షకులను అలరించబోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే ఇప్పటికే బాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో పాటు స్పెషల్ డ్యాన్స్ తోనూ మైండ్ బ్లాక్ చేస్తోంది. ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. నర్గీస్ ఫక్రీ తన బ్యూటీఫుల్ లుక్, ఫిట్ నెస్ తో ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గానే కనిపిస్తూ ఉంటుంది. మరోవైపు తనకు సమయం ఉన్నప్పుడల్లా ఇంటర్వ్యూలూ ఇస్తూ తన గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలను చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా తన గురించి ఓ సీక్రెట్ ను చెప్పుకొచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

తల్లి యూరోపియా.. తండ్రి పాకిస్థానీ..
నర్గీస్ ఫక్రీ 1979 అక్టోబర్ 20న న్యూయార్క్ లో జన్మించింది. ఆమె తండ్రి మహ్మద్ ఫక్రీ పాకిస్తాన్ కు చెందిన వాడు. తల్లి సెంట్రల్ యూరోప్ సిటిజెన్. కొన్నేళ్ళ కిందనే యూనైటెడ్ స్టేట్ లోని న్యూ యార్క్ నగరానికి వలస వెళ్లారు. అక్కడే నర్గీస్ ఫక్రీ జన్మించింది. తన స్కూలింగ్ ను కూడా అక్కడే పూర్తి చేసుకుంది. ఆమెకు 6 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. ఆమెకు చెల్లి అలియా కూడా ఉంది. కొన్నేళ్ళ కిందనే ఆమె తండ్రి కూడా చనిపోయాడు. ఇక ఆ తర్వాత తమకు ఉన్న ప్రాపర్టీస్ తో మోహెగన్ లేక్ టౌన్ లో పెరిగింది.

Bollywood Actress Nargis Fakhri Beauty Secret Revealed by her

యూఎస్ లో పుట్టి పెరిగి బాలీవుడ్ లోకి..
ఆమెకు 16 ఏళ్ల వయస్సులోనే మోడల్ గా నర్గీస్ ఫక్రీ మోడల్ గా కెరీయర్ ను ప్రారంభించింది. తొలుత అమెరికాలోని టెలివిజన్ సీరియల్ లో పాల్గొంది. దాంతో లోకల్ ఆడియెన్స్ లో గుర్తింపు పొంది. ఇక 2011లో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. రణబీర్ కపూర్ కెరీయర్ లోనే ఉత్తమ చిత్రం రాక్ స్టార్ లో నటించి నార్త్ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. బాలీవుడ్ లోనూ అప్పట్లో సెన్సేషన్ గా మారింది. ఆ తర్వాత మద్రాస్ కేప్, మే థేరా హీరో, సల్మాన్ ఖాన్ కిక్, సై, హౌజ్ ఫుల్ 3, డిష్యూమ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

9 రోజులు అది కావాల్సిందే..
నర్గీస్ ఫక్రీ రీసెంట్ గా తన ఇంటర్వ్యూలో ఓ సీక్రెట్ ను చెప్పింది. తన బ్యూటీఫుల్ లుక్ కు, జీరో సైజ్ నడుము, జా లైన్ కోసం తను స్పెషల్ డైట్ వాడుతానని చెప్పారు. ఆమె డైట్ చాలా విచిత్రంగా ఉంటుందని చెప్పింది. ఏడాదికి రెండుసార్లు 9 రోజుల పాటు కేవలం వాటర్ మాత్రమే తాగుతానని చెప్పింది. ఎలాంటి ఫుడ్ తీసుకోనని తెలిపింది. ఆ డైట్ కంప్లీట్ అయిన తర్వాత తను చాలా సన్నగా మారిపోతానని చెప్పింది. ఆ తర్వాత స్కిన్ గ్లో అవుతుందని అంటుంది. అయితే ఈ డైట్ ను ఫాలో అవ్వమని ఎవ్వరికీ చెప్పడం లేదని సూచించింది. తన బ్యూటీ అండ్ ఫిట్ నెస్ సీక్రెట్ లో ఇదొక భాగమని హిందీ మీడియాతో చెప్పింది.

పవన్ కళ్యాణ్ తో టాలీవుడ్ లోకి..
ప్రస్తుతం బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ముద్దుగుమ్మ బాలీవుడ్ బాట పడుతున్న సంగతి తెలిసిందే. దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా, కియారా అద్వానీ వంటి స్టార్స్ ప్రస్తుతం రెగ్యులర్ గా తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక ఊర్వశీ రౌటేలా ఇప్పటికే వరుసగా స్పెషల్ సాంగ్స్ తో దుమ్ములేపుతోంది. ఈ వరుసలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లుతో నర్గీస్ ఫక్రీ కూడా టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ చిత్రం జూలై 4న విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X