టాలీవుడ్‌లోకి బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ.. సెగలు రేపే స్పెషల్ సాంగ్ తో..

టాలీవుడ్‌లో కమర్షియల్ ఎంటర్‌టైనర్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా హీరో ఎలివేషన్ సీన్స్, ఫైట్లు, గ్లామర్ సాంగ్స్ అన్ని కలిస్తేనే సినిమా థియేటర్లలో హంగామా చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓ తెలుగు సినిమా చుట్టూ నెలకొన్న బజ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా చిన్న సినిమాలో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేయడానికి బాలీవుడ్ హాట్ బ్యూటీ సిద్దమైందట. ఇంతకీ ఆ హాట్ హీరోయిన్ ఎవరంటే? ఆ సినిమా ఏంటీ?

ఆ బాలీవుడ్ హీరోయిన్ ఎవరో కాదు.. నర్గీస్ ఫక్రి (Nargis Fakhri). ఈ అమ్మడు 'రాక్‌స్టార్'తో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. తన గ్లామర్‌తో పాటు నటనతో బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. అనంతరం 'మద్రాస్ కేఫ్', 'మెయిన్ తేరా హీరో', 'అజహర్', 'హౌస్‌ఫుల్' సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక మధ్య మధ్యలో స్పెషల్ సాంగ్స్‌తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక గత కొంతకాలంగా ఈ అమ్మడు టాలీవుడ్ ఎంట్రీ హాట్ టాపిక్ గా మారింది. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' సినిమాలో రోషనార పాత్రలో కనిపిస్తుందనే ప్రచారం జరిగింది.

Bollywood Actress Nargis Fakhri Tollywood Debut Glamorous Item Song in Nenu Ready Creates Buzz

అయితే ఆ సినిమా మొదటి భాగంలో ఆమె కనిపించకపోవడంతో ఆ వార్తలు అక్కడికే ఆగిపోయాయి. ఇక గత నెలలో కూడా మరోసారి నర్గీస్ ఫక్రీ పేరు టాలీవుడ్‌లో వినిపించింది. బాలకృష్ణ సినిమాలో ఆమె ఒక స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతుందనే టాక్ వచ్చింది. కానీ, ఫైనల్ గా యువ హీరో హవీష్, హీరోయిన్ కావ్య థాపర్ జంటగా తెరకెక్కుతున్న 'నేను రెడీ' అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టబోతుంది.

ఈ సినిమాకు నక్కిన త్రినాధరావు దర్శకత్వం వహిస్తున్నారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ ప్రదర్శనలో తనకంటూ ప్రత్యేక స్టైల్ ఉన్న త్రినాథరావు, ఈసారి కూడా పూర్తి మాస్ ప్యాకేజ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు కనిపిస్తోంది. 'నేను లోకల్', 'ధమాకా' వంటి హిట్‌ల తర్వాత ఆయన నుంచి వస్తున్న ఈ సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ సినిమాలో నర్గీస్ ఫక్రీ ఎంట్రీ మాత్రం ప్రత్యేక హైలైట్. ఆమె ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్‌లో కనిపించబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

బాలీవుడ్‌లో 'రాక్‌స్టార్'తో గుర్తింపు పొందిన ఈ బ్యూటీ, ఇప్పుడు టాలీవుడ్ స్క్రీన్‌పై తన గ్లామర్‌తో మాస్ ఆడియన్స్‌ను మెప్పించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్‌లో ఆమె లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెరిసే కాస్ట్యూమ్స్, స్టైలిష్ సెటప్, కలర్‌ఫుల్ లైటింగ్-అన్ని కలిపి ఈ సాంగ్ ఒక విజువల్ ట్రీట్‌గా ఉండబోతుందని అర్థమవుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ J మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మురళీ శర్మ వంటి అనుభవజ్ఞులైన నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాటోగ్రఫీని నిజర్ షఫీ నిర్వహించగా, ఎడిటింగ్ బాధ్యతలను ప్రవీణ్ పూడి చేశారు.

ఇలా 'నేను రెడీ' సినిమా ఒక పక్క కమర్షియల్ ప్యాకేజ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. నర్గీస్ ఫక్రీ గ్లామర్ ఎంట్రీ, త్రినాథరావు మాస్ టేకింగ్, మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అన్నీ కలిపి ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టే అవకాశం ఉంది. హవీష్ కెరీర్‌కు ఈ సినిమా టర్నింగ్ పాయింట్ అవుతుందా? నర్గీస్ ఐటమ్ సాంగ్ ఎంత వరకు హైలైట్ అవుతుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read more about: nargis fakhri bollywood tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X