Nikki Tamboli: నునులేత అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తున్న నిక్కీ తంబోలి..!
నిక్కీ తంబోలి.. ఈ పేరు తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా తెలిసుండకపోవచ్చు. కానీ బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం ఈ హాట్ బ్యూటీ గురించి చాలా బాగా తెలుసు. అలాగే సోషల్ మీడియాను ఎక్కువగా వాడే వారికి కూడా ఆమె ఎక్కువగానే తెలుస్తుంది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. కాంచన 3, తిప్పరా మీసం, అంటే సుందరానికి వంటి చిత్రాల్లోనూ హీరోయిన్ గా కనిపించిందీ క్యూట్ బ్యూటీ.
అలాగే నిక్కీ తంబోలి హిందీ బిగ్ బాస్ సీజన్ 14లో పాల్గొని రన్నరప్ గా నిలించింది. అప్పటి నుంచి ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత ఎక్కువయింది. కేవలం బిగ్ బాస్ లోనే కాకుండా... 2021లో ఫియర్ ఫాక్టర్: ఖత్రోన్ కె ఖిలాడీ 11 లో కూడా పాల్గొంది. టీవీ షోలు, సినిమాలతో పాటు ఆ హాట్ బ్యూటీ చాలానే మ్యూజిక్ వీడియోల్లో కూడా కనిపించి మెప్పించింది. పెద్ద ఎత్తున అభిమానులను సంపాధించుకుంది.

ఓ వైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టిగ్ ఉంటుంది నిక్కీ తంబోలి. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో అదిరిపోయే ఔట్ ఫిట్లో కనిపించి కుర్రకారును ఆగం చేస్తోంది. ముఖ్యంగా గ్రీన్ కలర్ డ్రెస్సు వేసుకొని కింది నుంచి పైవరకు అందాలన్నీ చూపించింది.

బాడీ షేపులన్నీ చాలా చక్కగా కనిపించేలా.. ఉన్న ఈ డ్రెస్సులో నిక్కీ తంబోలి అందాలన్నీ చాలా క్లియర్ గా కనిపించాయి. లాంగ్ ఫ్రాక్ వేసుకున్న ఈ ముద్దుగుమ్మ నడుము అందాలు అయితే అదిరిపోయాయి. నిక్కీ తంబోలి షేర్ చేసిన ఈ ఫొటోలు చూస్తుంటే.. ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. 4.5 మిలియన్ల ఫాలోవర్లను కల్గిన ఈ క్యూట్ బ్యూటీ ఇప్పటి వరకు వెయ్యి నాలుగు పోస్టులు పెట్టింది. అందులో అదిరిపోయే ఫొటోలు పెట్టగా.. పెద్ద ఎత్తున నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ ఆమె ఫ్యాన్స్ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. నీ డ్రెస్సుతో పాటు స్టైల్ కూడా అదిరిందమ్మా అంటూ చెప్పుకొస్తున్నారు. నిజంగా గ్రీన్ లాంగ్ డ్రెస్సులో నిక్కీ తంబోలి అందాలు అదిరిపోయాయి. మీరూ ఓ సారి ఈ అద్భుతమైన ఫొటోలు చూసి ఆనందించండి.


Click it and Unblock the Notifications











