పడక గదిలో లొంగకపోతే అలాంటి పరిస్థితి...ఇండస్ట్రీ బాగోతం ప్రభాస్ హీరోయిన్ బట్టబయలు..!
బీ టౌన్ లో హీరోయిన్ గా ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న నోరా ఫతేహి తాజాగా హిందీ పరిశ్రమలోని చీకటి కోణాలను, బాలీవుడ్ బాగోతాలను బట్టబయలు చేసింది. హీరోయిన్లు లొంగకపోతే అక్కడ స్టార్స్ ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాన్ని బయట పెట్టేసింది. మరి ఇంతకీ హిందీ సినీ పరిశ్రమలో ఈ హాట్ బ్యూటీ కి ఎదురైన చేదు అనుభవాలు ఏంటి? బాలీవుడ్ పరిశ్రమలో జరుగుతున్న షాకింగ్ పరిణామాలు ఏంటి అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై మనం కూడా ఓ లుకేద్దాం.
సినిమాల కంటే ఐటమ్ సాంగ్స్ తోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి. తన అద్భుతమైన డ్యాన్స్ స్కిల్స్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో చిట్టి పొట్టి బట్టలు ధరించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానుల కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. ఫస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ బాహుబలి మూవీలో మనోహరి అనే సాంగ్ లో ప్రభాస్ తో ఆడి పాడింది ఈ అమ్మడు. అలాగే టెంపర్, కిక్ 2, లోఫర్ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరిసింది.

తాజాగా రణవీర్ అలహబాడియా పాడ్ కాస్ట్ కు హాజరైన నోరా ఫతేహి హిందీ చిత్ర పరిశ్రమంలోని ప్రముఖుల ప్రేమ, పెళ్లి వెనుక ఉన్న చీకటి నిజాలను వెలుగులోకి తీసుకొచ్చింది. నోరా ఫతేహి మాట్లాడుతూ తను ఇప్పటి వరకు ప్రేమలో పడలేదని, అవకాశాల కోసం దిగజారలేదని వెల్లడించింది.
ఇక ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి అనేది కేవలం పాపులారిటీ కోసం మాత్రమే అని, పేరు, స్టార్ డమ్, డబ్బు, కనెక్షన్స్ పెంచుకోవడానికి పెళ్లిళ్లు చేసుకుంటారని, ప్రేమలో ఉన్నట్టు నటిస్తారని చెప్పుకొచ్చింది. ఇక ఒక పాపులర్ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్ల కనీసం మూడేళ్ల పాటు పాపులర్ గా అవుతామా? అనే లెక్కలతోనే పెళ్ళికి సిద్ధమవుతారని చెప్పుకొచ్చింది. ఇలా డబ్బు, పాపులారిటీ కోసం వ్యక్తిగత జీవితాన్ని, ప్రొఫెషనల్ లైఫ్ ను కలిపేసి తరువాత డిప్రెషన్ బారిన పడతారని, ఆత్మహత్య ఆలోచనలు వస్తాయని వెల్లడించింది.

ఇక బాలీవుడ్ లో కొంతమంది నటులు అవకాశాలు ఇస్తామని చెప్పి తనతో దగ్గర అవ్వాలని చూస్తారని, కానీ తను అలాంటి అమ్మాయిని కాదని మొహం మీద చెప్పేస్తానని క్లారిటీ ఇచ్చింది నోరా. కానీ కొంతమంది మాత్రమే అర్థం చేసుకుంటారని, మరికొందరు కోపం పెంచుకుని వాళ్ళ సినిమాలో తను నటిస్తుందని తెలియగానే సెట్లో సీరియస్ అవుతారని, బెదిరిస్తారని, కించపరిచేలా మాట్లాడతారని బాలీవుడ్ హీరోయిన్ల పరిస్థితిని వివరించింది.
తాను ఎవ్వరికీ లొంగక పోవడంతో తన మీద చెత్త ప్రచారాలు మొదలు పెట్టారని, ఇండస్ట్రీలో పెద్దలుగా చెప్పుకునే కొంతమంది ఆడవాళ్లు చెప్పినట్టు విని, నమ్రతగా ఉండాలని కోరుకుంటారని, వాళ్ళు చెప్పినట్టుగా వినకపోతే ఆమెకు యాక్టింగ్ రాదు, ఎందుకు తీసుకున్నారు అంటూ అవకాశాలు రాకుండా చేశారనే షాకింగ్ విషయాలను ధైర్యంగా బయట పెట్టి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది నోరా. ప్రస్తుతం నోరా చేతిలో ఒక హిందీ, ఒక తెలుగు సినిమా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











