వాకింగ్ స్టిక్‌తో బాహుబలి బ్యూటీ .. హాస్పిటల్ బెడ్‌పై నరకయాతన , అసలేమైంది?

డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించి స్టార్ స్టేటస్ అందుకున్న నటీనటులు ఇండస్ట్రీలో వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. వారిలో బాలీవుడ్ సెక్సీ బాంబ్ నోరా ఫతేహి కూడా ఒకరు. చిన్నా చితకా సినిమాలు చేస్తున్న ఈమె జీవితాన్ని బాహుబలి మలుపు తిప్పింది. అందులోని మనోహరి సాంగ్‌‌ ఆమె కెరీర్‌కు ఓ బూస్టప్‌లా పనిచేసింది. ప్రభాస్‌తో కలిసి నోరా వేసిన స్టెప్స్‌ని ఇప్పటికీ అభిమానులు మరిచిపోలేరు. అలాంటి నోరా హెల్త్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ వివరాల్లోకి వెళితే..

రేర్ : టైగర్స్ ఆఫ్ ది సుందర్‌బన్స్ మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన నోరా ఫతేహి మంచి పేరు తెచ్చుకుంది. ఆ వెంటనే బిగ్‌బాస్ షోలో అవకాశం దక్కించుకుని మరింత పాపులర్ అయ్యింది. స్వతహాగా మంచి డ్యాన్సర్ కావడంతో నోరా ఫతేహికి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసే ఛాన్సులు దక్కాయి. తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన టెంపర్‌లోని ఇట్టాగే రెచ్చిపోదామంటూ తెలుగు వారిని పలకరించింది.

Bollywood actress Nora Fatehi Shares Her Treatment Video Here s the details

అయితే దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి విజువల్ వండర్ బాహుబలి బ్రేక్ ఇచ్చింది. ఇందులోని మనోహరి సాంగ్‌ ద్వారా ఆమెకు నేషనల్ వైడ్ పాపులారిటీ దక్కడంతో పాటు వరుసపెట్టి అవకాశాలు క్యూకట్టాయి. కేవలం స్పెషల్ సాంగ్స్ మాత్రమే చేసే నోరా ఫతేహి.. స్టార్ హీరోయిన్స్‌తో సమానంగా రెమ్యునరేషన్ వసూలు చేస్తూ షాకిస్తోంది. 5 నిమిషాల పాట కోసం రూ.2 నుంచి 4 కోట్ల మధ్యలో డిమాండ్ చేస్తోందని బీ టౌన్ టాక్. అయితే నోరాకు మరో సెక్సీ బాంబ్ ఊర్వశి రౌతేలా నుంచి పోటీ ఎదురవుతోంది.

Bollywood actress Nora Fatehi Shares Her Treatment Video Here s the details

విషయం ఏదైనా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడటం ఆమె స్టైల్. ఎవరు ఏమనుకున్నా సరే క్లారిటీగా మాట్లాడుతుంది . మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ ఇండస్ట్రీపై, బాలీవుడ్ కపుల్స్‌పై హాట్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో ఫేమ్, డబ్బు కోసం కొందరు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని.. ప్రేమించని వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కంటే దారుణం ఉంటుందా అని నోరా ఫతేహి ప్రశ్నించింది. ఇష్టం లేకపోయినా మనసు చంపుకుని వారితోనే జీవిస్తున్నారని , అలాంటి పనికిమాలిన వాళ్లు చాలా మంది ఉన్నారని ఆమె కామెంట్ చేసింది. తనకు బాయ్ ఫ్రెండ్స్ లేరని, చాలా మంది తనను కేవలం వారి ఫేమ్ కోసమే వాడుకుంటున్నారని నోరా ఫతేహి సంచలన వ్యాఖ్యలు చేసింది. అందుకే తాను అబ్బాయిలతో డేటింగ్ చేయననని ఆమె తేల్చిచెప్పింది.

కాగా.. నోరా ఫతేహి హెల్త్ కండీషన్‌ బాలేదని మీడియాలో కథనాలు వచ్చాయి. వీటిని చాలా మంది రూమర్స్ గానే కొట్టిపారేశారు. కానీ వీటిని నిజం చేస్తూ ఆమె వాకింగ్ స్టిక్‌తో నడుస్తున్న వీడియోను షేర్ చేసుకున్నారు. అందులో డాక్టర్లు ట్రీట్‌మెంట్ చేస్తుండగా ఆ నొప్పి భరించలేక నోరా ఫతేహి విలవిలలాడిపోతోంది. ఫిజియో తనను కేరింగ్‌గా చూసుకుంటున్నారు.. త్వరలోనే మళ్లీ సెట్స్‌లో కలుసుకుందామని ఆమె వీడియోలో పేర్కొన్నారు. తన లేటెస్ట్ మూవీ మట్కా షూటింగ్‌ సందర్భంగా హైదరాబాద్‌లో నోరా ప్రమాదానికి గురై గాయపడ్డారు. దీంతో వైద్యులు ఆమెను రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు.

More from Filmibeat

Read more about: movie news nora fatehi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X