బీచ్‌లో భర్తతో హద్దు మీరిన ప్రియాంక చోప్రా.. బికినీలో శృంగార లీలలు!

బాలీవుడ్ హస్కీ బ్యూటీ ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతుంటారు. తాజాగా భర్త నిక్ జోనాస్, కుమార్తె మాల్తీ మేరీతో కలిసి వెకేషన్‌కు వెళ్లిన ప్రియాంక.. అక్కడ బికినీలో పరువాల విందు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రియాంక చోప్రా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆమెకు గుర్తింపు ఉంది. హిందీలో కాకుండా తమిళ సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన ప్రియాంక చోప్రా.. అతి తక్కువ కాలంలోనే తన అందం, అభినయంతో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు. కొన్నేళ్ల పాటు బాలీవుడ్‌ని, భారతీయ చిత్ర పరిశ్రమను ఒక ఊపు ఊపింది.

Bollywood actress Priyanka Chopra spend time with her husband Nick Jonas in South of France here s the details

తన సినిమాలతోనే కాకుండా పెళ్లితోనూ ప్రియాంక చోప్రా సంచలనం సృష్టించారు. హాలీవుడ్ రేపర్ నిక్ జోనాస్‌ను 2018లో ఆమె వివాహం చేసుకున్నారు. ఆమె కంటే నిక్ దాదాపు పదేళ్లు చిన్నవాడు. ఎన్ని విమర్శలు వచ్చినా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు ప్రియాంక చోప్రా. అనంతరం సరోగసీ ద్వారా కుమార్తె మాల్టీకి జన్మనిచ్చి.. భర్త, పాపతో గడుపుతోంది ప్రియాంక.

బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు మకాం మార్చిన ప్రియాంక దాదాపుగా హిందీ ఇండస్ట్రీని వదిలిపెట్టేసింది. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గుతున్న దశలో ఓటీటీలు ఆమెను ఆదుకున్నాయి. హిందీ, ఇంగ్లీష్‌లలో పలు వెబ్ సిరీస్‌లలో ప్రియాంక నటించింది. గ్లోబల్ స్టార్‌గా అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీ సంపాదించిన ఆమె భారత్‌లో రిచెస్ట్ హీరోయిన్‌లలో ఒకరిగా నిలిచారు. అలాంటిది మొన్నామధ్య తన ఆస్తులను అమ్ముకున్నట్లుగా వార్తలు రావడంతో అంతా షాకయ్యారు.

గతేడాది ముంబైకు శివార్లలోని లోఖండ్ వాలాలో ఓ కమర్షియల్ ప్రాపర్టీని దాదాపు రూ.7 కోట్లకు అమ్ముకుని షాకిచ్చింది ప్రియాంక. అది జరిగి రోజులు గడవకముందే అంధేరిలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న తన అపార్ట్‌మెంట్‌ను సేల్‌కు పెట్టింది. దీనిని దర్శకుడు అభిషేక్ చౌబే రూ.6 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నట్లుగా అప్పట్లో బాలీవుడ్ కోడై కూసింది. ఈ అమ్మకం ప్రక్రియను ప్రియాంక తల్లి మధు చోప్రానే దగ్గరుండి చూసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.

ఇక తన సినిమాలు, షూటింగ్స్‌కు ఏమాత్రం విరామం దొరికినా సరే భర్త, కూతురితో కలిసి గడపటానికే ఈ ముద్దుగుమ్మ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి సౌత్ ఫ్రాన్స్‌లో వెకేషన్‌కు వెళ్లింది ప్రియాంక. అక్కడి హోటల్ డూ క్యాప్‌లో వీరి కుటుంబం బస చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అన్నింటికి మించి బికినీ వేసుకుని బీచ్‌లో పడవలో భర్త ఒళ్లో పడుకుని సెగలు రేపుతోంది ప్రియాంక. వైట్ కాలర్ బాడీకాన్ డ్రెస్సులో ఉన్న ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా రోజుల తర్వాత మరాఠీలో తెరకెక్కిన పానీ మూవీలో ప్రియాంక చోప్రా నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Read more about: priyanka chopra nick jonas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X