‘8 ఏళ్లలోనే నాపై లైంగికదాడి.. గురువే అలా చేశాడు’.. బాలీవుడ్ హీరోయిన్ ఆవేదన

బాలీవుడ్ హీరోయిన్ తన చిన్న వయసులోనే లైంగిక వేధింపులకు గురికావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తనే స్వయంగా చైల్డ్ హుడ్ లో తనకు జరిగిన చేదు అనుభవాన్ని చెప్పుకుంది. బాలీవుడ్ టెలివిజన్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అంజలి ఆనంద్ తన జీవితంలో జరిగిన చేదు ఘటనను రీసెంట్ ఇంటర్వ్యూలో తెలియజేసింది. తనలాంటి పరిస్థితి మరొక అమ్మాయికి కలగకూడదని కూడా కోరుకుంది. ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె 8 ఏళ్ల వయసులోనే ఇలాంటి అసహ్యమైన ఘటనకు గురైందో నిర్మోహమాటంగా తెలియజేసింది.

అంజలి ఆనంద్ బాలీవుడ్లో ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా మంచి మంచి అవకాశాలను అందుకుంటుంది. చివరిగా బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ సింగ్ సరసన రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని, చిత్రంలో నటించింది. గాయత్రి పాత్రలో ప్రేక్షకులను అలరించింది. ఇక ఆ తర్వాత బన్ టిక్కీ.. చిత్రంలోనూ నటించింది. 2017 నుంచి 2024 వరకు టెలివిజన్ సీరియల్స్ తో హిందీలో నటించింది. ఆడియన్స్ లో తనకంటూ స్పెషల్ ఇమేజస్ని క్రియేట్ చేసుకుంది. ఇప్పుడిప్పుడే వెండితెరపై వెలుగుతూ తన కెరీర్ ను వేగవంతం చేస్తుంది.

Bollywood Actress Revealed her child life bad Incident with her Teacher

ఇక ప్రస్తుతం ఒక క్రేజీ వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్ ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫిక్స్ లో అందుబాటులో ఉంది. సౌత్ హీరోయిన్ జ్యోతిక కూడా ఈ సిరీస్లో కీలక పాత్ర పోషించి. ఇక అంజలి ఆనంద్ కూడా నటించడం విశేషం. అయితే ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా అంజలి ఆనంద్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమయంలోనే తన చిన్ననాటి చేదు అనుభవాన్ని ఓపెన్ గా చెప్పినట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఆ కథనాల ప్రకారం.. అంజలి ఆనంద్ తను డాన్స్ నేర్చుకునే ఇక కోచ్ ను ఆశ్రయించిందని చెప్పింది. తన చిన్నవయస్సులోనే డ్యాన్స్ పై మక్కువతో నేర్చుకునేందుకు ప్రయత్నించినట్టు తెలిపింది. కానీ అతను ఎప్పుడూ తనతో ఏకాంతంగా ఉన్న సమయంలో ఏదైనా చేయడనానికి ప్రయత్నిస్తూ ఉండేవాడని, నేను మీనాన్న లాంటి వాడినని చెప్పి తన పెదాలపై ముద్దు కూడా పెట్టాడని చెప్పుకుంటూ బాధపడినట్టు ఆ వార్తల సారాంశం. ఇక ఆ సమయంలో తనకు ఏం చేయాలో అర్థం కాలేదని వివరించింది.

తనకు ఎనిమిదేళ్ల వయస్సు ఉన్న అప్పుడే ఇలా జరిగిందని, తన తండ్రి కూడా ఆ సమాయానికి చనిపోయాడని చెప్పింది. తనకు అప్పుడు పెద్దగా ఎవరు తెలియకపోవడంతో అతన్ని నమ్మానని కూడా చెప్పుకొచ్చింది. ముద్దు పెట్టడమే కాకుండా నాన్నలు చేసేది అని కూడా మాట్లాడాడని నిర్భయంగా నిజాన్ని వెల్లడించినట్టు తెలుస్తోంది. దీంతో ఆ నటి చిన్నప్పుడు ఎదుర్కొన్న చేధు అనుభవాన్ని చూసి అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఇంకెవ్వరికీ రాకూడదని కోరకుంటున్నారు. ఇక బాలీవుడ్ లో యంగ్ బ్యూటీగా అంజలి ఆనంద్ వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. ప్రస్తుతం తన కెరీయర్ లో సినిమాలపైనే ఫోకస్ పెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X