నరకం చూపించాడు.. కాబోయే భర్తపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. పెళ్లికి ముందే యువ నటి బ్రేకప్

సినిమా ఇండస్ట్రీలో సినీ తారలు విడిపోవడం సర్వసాధారణంగా మారింది. వ్యక్తిగత, ఇతరత్ర కారణాల వల్ల దాంపత్య జీవితానికి ముగింపు పలకడం తరచూ కనిపిస్తుంటుంది. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన హీరోయిన్ సాబా కామర్ తన కాబోయే భర్తతో తెగతెంపులు చేసుకొన్నది. అయితే కాబోయే భర్త అజీమ్ ఖాన్‌పై దారుణమైన ఆరోపణలు రావడం వీరు తమ పెళ్లిని క్యాన్సిల్ చేసుకొన్నారు. ఈ వ్యవహారం పాకిస్థాన్‌కే కాకుండా విదేశీ మీడియాలో కూడా హైలెట్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే...

పెళ్లికి ముందే వివాదం

పెళ్లికి ముందే వివాదం


సాబా కామర్ వివాహం పాకిస్థాన్‌కు చెందిన బ్లాగర్, పారిశ్రామికవేత్త అజీమ్ ఖాన్‌తో జరుగాల్సి ఉంది. అయితే పెళ్లికి ముందే అజీమ్ ప్రవర్తన వివాదాస్పదమైంది. ఓ మహిళలతో అక్రమ బంధం పెట్టుకొన్నారనే తీవ్ర ఆరోపణలు వచ్చిన మరుసటి రోజే సాబా కామర్‌తొ నిశ్చితార్థం జరిగింది. ఆ ఆరోపణలను పట్టించుకోకుండా అజీమ్ ఖాన్‌ను వివాహం చేసుకోవాలనుకొన్నది. కానీ అనూహ్యంగా ఆమె ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకొంటున్నట్టు ప్రకటించింది.

నిశ్చితార్థం తర్వాత ఆలోచించా

నిశ్చితార్థం తర్వాత ఆలోచించా


బ్లాగర్ అజీమ్ ఖాన్‌తో పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జరిగాయి. నిశ్చితార్థం తర్వాత నా నిర్ణయాన్ని పున: సమీక్షించుకొన్నాను. దాంతో పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నాను అని సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. అజీమ్ ఖాన్‌ను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలుసుగోలేదని, కేవలం ఫోన్ ద్వారానే కాంటాక్ట్‌లో ఉన్నాం అని సాబా కారమ్ చెప్పారు.

నిశ్చితార్థం రద్దు చేసుకోవాలని..

నిశ్చితార్థం రద్దు చేసుకోవాలని..

తన పెళ్లి రద్దు విషయంపై మీకు ముఖ్యమైన సమాచారం అందించాలని ఈ పోస్టు పెడుతున్నాను. కొన్ని కారణాల వల్ల నిశ్చితార్థం రద్దు చేసుకొంటున్నాను. మేమిద్దరం పెళ్లి చేసుకోవడం లేదు. ఈ విషయంలో మీరు నాకు సపోర్ట్ చేయండి. గతంలో కూడా నాకు పలు సందర్భాల్లో నాకు అండగా ఉన్నారు. కొన్ని చేదు అనుభవాల నుంచి బయటపడటం ఆలస్యమైనా మంచి నిర్ణయమే తీసుకొంటున్నానని అనుకొంటున్నాను అని సాబా పేర్కొన్నారు.

వ్యక్తిగత బంధం మా మధ్య లేదు

వ్యక్తిగత బంధం మా మధ్య లేదు

అజీమ్ ఖాన్‌తో ఉన్న అనుబంధం గురించి సాబా కారమ్ ప్రత్యేకంగా సోషల్ మీడియాలో స్పష్టం చేశారు. ఆయనను వ్యక్తిగతంగా కలుసుకోలేదు. కేవలం ఫోన్‌లోనే మా బంధాన్ని కొనసాగించాం. జీవితంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమైన పనిగా భావిస్తున్నాను. తొందరగానే ఇలాంటి నిర్ణయం తీసుకోనేలా శక్తిని ఇచ్చిన దేవుడికి ధన్యవాదాలు చెప్పుకొంటున్నాను అని సాబా కారమ్ పేర్కొన్నారు.

సాబా పోస్టుపై అజీమ్ ఖాన్ రెస్సాన్స్

సాబా పోస్టుపై అజీమ్ ఖాన్ రెస్సాన్స్

సాబా కారమ్‌తో బ్రేకప్ గురించి అజీమ్ ఖాన్ సోషల్ మీడియాలో స్పందించారు. సాబా కారమ్ అద్భుతమైన వ్యక్తి. ఈ ప్రపంచంలో అన్ని రకాల ఆనందాలను ఆమె పొందాలని కోరుకొంటున్నాను. జీవితంలో పరిపూర్ణమైన ప్రేమను, సక్సెస్‌ను పొందాలని ఆశిస్తున్నాను. అద్భుతమైన ప్రయాణానికి ముందు గతుకుల రోడ్ల మీద జర్నీ చేయాల్సి వస్తుంది. ఈ బ్రేకప్‌కు పూర్తి బాధ్యత నాదేనని చెబుతున్నాను అంటూ అజీమ్ ఖాన్ తన పోస్టులో పేర్కొన్నారు.

అజీమ్ ఖాన్‌పై లైంగిక దాడి ఆరోపణలు

అజీమ్ ఖాన్‌పై లైంగిక దాడి ఆరోపణలు


సాబా కారమ్‌తో నిశ్చితార్థానికి ముందు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. తనకు నరకం చూపించారంటూ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం నిశ్చితార్థానికి ముందు రోజే జరగడం వివాదంగా మారింది. ఇలాంటి వివాదం మధ్య సాబా, అజీమ్ నిశ్చితార్తం జరిగింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలు ఆయన తీవ్రంగా ఖండించారు. ఆ మేరకు ఓ వీడియోను కూడా అజీమ్ రిలీజ్ చేశాడు.

బాలీవుడ్‌లో సాబా కామర్ కెరీర్

బాలీవుడ్‌లో సాబా కామర్ కెరీర్


పాకిస్థాన్‌లోని హైదరాబాద్‌లో సింధి కుటుంబంలో జన్మించిన సాబా కామర్ జమాన్ తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. హిందీ మీడియం చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. అంతకు ముందు పాకిస్థాన్‌లో ఆయినా, మాంటో, లాహోర్ సే ఆగే, దిల్ దియా గలాన్, సిక్కా, కంబఖ్త్ లాంటి చిత్రాల్లో నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X