కూతురిని మించిన అందం... శ్రద్ధా కపూర్ తల్లిని చూశారా? వైరల్ పిక్!

బాలీవుడ్ యంగ్ బ్యూటీ, ది గ్రేట్ కపూర్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శ్రద్ధా కపూర్ నార్త్ లో చాలా మంచి పేరు సంపాదించుకుంది. నటిగా ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ పొందింది. బాలీవుడ్ చిత్రాలతో దేశవ్యాప్తంగా ఈ ముద్దుగుమ్మ సాలిడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సొంతం చేసుకుంది. శ్రద్ధా కపూర్ నటించిన 'ఆషికీ 2'తో ఇండియా మొత్తం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ చిత్రంలో తన నటనకు నార్త్ లోనే కాకుండా సౌత్ ఆడియెన్స్ కూడా ఫుల్ ఫిదా అయ్యారు. దక్షిణాదిలోనూ యువతకు డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. తన సినిమాలకు మంచి మార్కెట్ కూడా ఏర్పడింది.

'ఆషికీ 2', 'ఏక్ విలన్', 'ఏబీసీడీ 2', 'ఓకే జాను', 'చిచ్చోరే', 'భాగీ 3' వంటి చిత్రాలతో తన నటనకు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అంతే కాదు పలు చిత్రాల్లో స్పెషల్ అప్పీయరెన్స్ తోనూ దుమ్ములేపింది. ఇక 'స్త్రీ' సిరీస్ లతోనూ ఈ బ్యూటీ సెన్సేషనల్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది. అయితే ఈతరం హీరోయిన్లలో శ్రద్ధా కపూర్ కు మంచి క్రేజ్ ఉండటం విశేషం. ఆమెకు కూడా డైహార్ట్ ఫ్యాన్స్ ఉంటారు. ముఖ్యంగా శ్రద్ధా కపూర్ తన నటనతో కంటే ఆకర్షించే రూపసౌందర్యంతోనే ప్రేక్షకులను తొలిచూపులోనే ఆకట్టుకుంది. ఆమె స్మైల్, అందంతో ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంది.

Shraddha Kapoor Mother

అయితే... శ్రద్ద కపూర్ తల్లిగారికి సంబంధించిన ఫొటో ఒక్కటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. శ్రద్ధా కపూర్ తల్లి శివాంగి కపూర్ ఓల్డ్ ఫొటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించుకుంది. కాగా ఆ ఫొటోలో శివాంగి కపూర్ ను చూస్తే అచ్చం కూతురు శ్రద్ధా కపూర్ లానే కనిపిస్తోంది. ఆమె ఫిట్ నెస్, రూపసౌందర్యంలోనూ కూతురును తలదన్నేలా ఉండటం విశేషం. తల్లికూతుర్లు ఇద్దరూ ఓకే పోలికలతో ఉండటంతో ట్విన్స్ లా కనిపిస్తున్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. శ్రద్ధా కపూర్ కు పూర్తిగా తన తల్లిగారి పోలికలే వచ్చాయని అంటూ ఆ రేర్ ఫొటోను నెట్టింట వైరల్ గా మారుస్తున్నారు.

ఇక శ్రద్ధా కపూర్.. 1987లో శక్తి కపూర్ - శివాంగి కపూర్లకు జన్మించింది. ప్రస్తుతం శ్రద్ధా కపూర్ తల్లి శివాంగి కపూర్ కు 61 ఏళ్లు. అయినప్పటికీ ఎంతో ఎనర్జిటిక్ గా కనిపిస్తుంటారామె. పలు ఈవెంట్లలో కూతురితో కలిసి సందడి చేస్తుంటారు. శ్రద్ధా కపూర్ కు బ్రదర్ సిద్ధాంత్ కపూర్ కూడా ఉన్నారు. ఇక శివాంగి కపూర్ మరాఠికి చెందిన కుటంబీకురాలు. కాగా 1982లో పంజాబీలకు చెందిన శక్తి కపూర్ ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం కుటుంబంతో కలిసి అంతా ముంబైలోనే నివాసం ఉంటున్నారు.

మరోవైపు శ్రద్ధా కపూర్ సినిమాల విషయానికొస్తే... బాలీవుడ్ లో మంచి హిట్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. విభిన్న పాత్రలు పోషించిన ఈ బ్యూటీ ఇటు సౌత్ లోనూ మంచి క్రేజ్ దక్కించుకోవడంతో ఏకంగా రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ ను 'సాహో'తో దక్కించుకుంది. మరోవైపు లిప్ లాక్ కూడా చేసి ఆశ్చర్యపరించింది. చివరిగా 'స్త్రీ2'తో ప్రేక్షకులను అలరించింది. ఇక శ్రద్దా కపూర్ పేరు ఫోర్బ్ లిస్ట్ లోనూ చేరడం గమనార్హం. ఫోర్బ్ ఇండియా సెలబ్రెటీ లిస్ట్ లో 2014 నుంచి 30లోపే తన పేరు కనిపిస్తుండటం మరో విశేషం.

More from Filmibeat

Read more about: shraddha kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X