‘మా ఇంట్లో దెయ్యం.. రాత్రి మొత్తం భయంతో వణికిపోయా’
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తన అందం అభినయంతో నార్త్ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ నటించిన చిత్రాల్లో తెలుగు వెర్షన్ లోనూ విడుదల కావడంతో సౌత్ ఆడియెన్స్ లోనూ గుర్తింపు దక్కించుకుంది. 2010 నుంచి చిత్ర పరిశ్రమలో ఎంతో యాక్టివ్ గా కనిపిస్తోంది. ఎంపీ కూతురు అయినప్పటికీ తన టాలెంట్ తో ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని కొన్నేళ్లు కష్టపడింది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక ప్రస్తుం పెళ్లి చేసుకొని జీవిత భాగస్వామితో కొత్త లైఫ్ ను ప్రారంభించింది. మరోవైపు చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈక్రమంలో తనకు సమయం ఉన్నప్పుడల్లా ఇంటర్వ్యూలు ఇస్తూ ఆకట్టుకుంటోంది. ఇక తాజా తన గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
సోనాక్షి సిన్హా ఫ్యామిలీ వివరాలు..
సోనాక్షి సిన్హా బిహార్ లో పుట్టి పెరిగింది. 1987 జూన్ 2న పట్నాలో పుట్టింది. బాలీవుడ్ నటుడు షత్రుగన్ సిన్హా, పూనమ్ సిన్హాల దంపతులకు జన్మించింది. సోనాక్షి సిన్హా తండ్రి రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా ఉంటారు. బిహార్ లో పార్లమెంట్ సభ్యురాలిగా కూడా ఎన్నికై ప్రజా సేవ చేశారు. భారతీయ జనతా పార్టీ నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోంది. ఇక సోనాక్షి సిన్హాకు ఎల్యూవీ సిన్హా, ఖుషు సిన్హా అనే ఇద్దరు బ్రదర్స్ కూడా ఉన్నారు. సోనాక్షి సిన్హా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు ను పూర్తి చేసుకుంది. పలు చిత్రాలకు క్యాస్టూమ్స్ ను కూడా అందింది.

తొలిచిత్రంతోనే సెన్సేషన్ గా..
బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సోనాక్షి సిన్హాకు బంపర్ ఆఫర్ వచ్చింది. ఈ బ్యూటీ ఎంట్రీ చాలా గ్రాండ్ గా జరిగింది. ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన నటించే ఛాన్స్ ను దక్కించుకుంది. 2010లో హిందీలో విడులైన దబాంగ్ చిత్రంలో నటించి నార్త్ లో సంచలనంగా మారింది. దబాంగ్ సినిమాను తెలుగులో గబ్బర్ సింగ్ గా పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. దబాంగ్ తొలిచిత్రం కావడం విశేషం.
ఆ తర్వాత రౌడీ రాథోడ్, జోకర్, సన్ ఆఫ్ సర్దార్, దబాంగ్ 2, ఆర్ రాజ్ కుమార్ , యాక్షణ్ జాక్షన్, లింగా, ఫోర్స్ 2, కళాంక్, మిషన్ మంగల్, దబాంగ్ 3, బడే మియా చోటే మియా వంటి చిత్రాల్లో నటించింది. 15 ఏళ్లుగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.
బెడ్ రూమ్ లో దయ్యం..
సోనాక్షి సిన్హా చాల సరదాగా కనిపిస్తూ ఉంటారు. చాలా ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు. అయితే తాజాగా తన గురించిన ఓ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఓసారి తన గదిలో ఏదో అలజడిని గమనించిందంట. తన బెడ్ రూమ్ లో ఎవరో ఉన్నట్టుగా ఫీల్ అయినట్టు అనిపించిందని, అనుమానంతో అంతంటా చూస్తుండగా తనకు దెయ్యం కనిపించిందని సోనాక్షి సిన్హా చెప్పినట్టు బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. అయితే ఆ ఘటన తర్వాత రాత్రంతా భయంతో వణికిపోయిందంట, తనకు లైఫ్ లో ఇప్పటికీ ఆ ఘటన గుర్తుకు వస్తే భయం వేస్తుందని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో సెలబ్రెటీలకు కూడా ఇలాంటి భయాలు ఉంటాయా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











