సుశాంత్ సింగ్ సూసైడ్ ఎఫెక్ట్.. నెటీజన్స్ తిట్లకు తట్టుకోలేకపోయిన సోనమ్.. ఏం చేసిందంటే?
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి చెందినప్పటి నుంచి రోజుకో వార్త మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. సుశాంత్ సూసైడ్ బాలీవుడ్ పై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతోందనే చెప్పాలి. ముఖ్యంగా నెపోటీజమ్ దెబ్బకు సినీ తారలకు ఊపిరి ఆడటం లేదు. నెటీజన్స్ సోషల్ మీడియాలో బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి వచ్చిన స్టార్స్ కి చుక్కలు చూపిస్తున్నారు.
Recommended Video

సుశాంత్ సూసైడ్ ఎఫెక్ట్..
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ బాలీవుడ్ లోనే కాకుండా ఇతర సినిమా ఇండస్ట్రీలలో కూడా అందరిని షాక్ కి గురి చేసిందనే చెప్పాలి. నిండు భవిష్యత్తు ఉన్న యువ హీరో ఆ విధంగా ప్రాణాలు తీసుకోవడం వెనక ఎన్నో తెలియని దుష్ట శక్తులు ఉన్నాయని సాధారణ జనాలతో పాటు స్టార్ సెలబ్రెటీస్ కూడా కామెంట్ చేస్తున్నారు. ఇక ఎక్కువగా కరణ్ జోహార్, సల్మాన్, అలియా భట్ వంటి వారిపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

సోనమ్ కీలక నిర్ణయం..
ఇక అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ కి కూడా నెపోటీజమ్ విమర్శలు తీవ్ర స్థాయిలో వెలువడుతున్నాయి. ఆమె చేసిన ప్రతి సోషల్ మీడియా పోస్ట్ కి ఓ వర్గం నెటీజన్స్ నుంచి ఊహించని స్థాయిలో తిట్లు వెలువడుతున్నాయి. ఇకపోతే నెటీజన్స్ తిట్లను తట్టుకోలేక సోనమ్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరి నుంచి నెగెటివ్ కామెంట్స్ రాకూడదని తన సోషల్ మీడియాలో ప్రైవసీ సెట్టింగ్స్ ని మార్చింది.

నెగిటివ్ కామెంట్స్ రాకుండా..
నీ తండ్రి లేకపోయి ఉంటే అసలు నిన్ను సినిమాల్లోకి ఎవరు తీసుకునేవారు అనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. దీంతో సోనమ్ తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ లో ఇకపై ఎవరు కూడా తన ఫొటోస్ కింద కామెంట్స్ చేయకుండా కామెంట్ సెక్షన్ ని ఆఫ్ చేసింది. ఎప్పుడు లేని విధంగా సోనమ్ ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం చూస్తుంటే.. ఆమే ఏ స్థాయిలో ఆలోచించి ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

అవును..గర్వపడుతున్నా
ఇక రీసెంట్ గా ఫాథర్స్ డే సందర్భంగా ఆమె తన తండ్రితో ఉన్న ఫొటోస్ ని షేర్ చేస్తూ.. అవును నేను నా తండ్రి వల్లే ఈ స్థాయిలో ఉన్నాను. ఈ హోదా ఈ గుర్తింపు ప్రతి ఒక్కటి నా తండ్రి వల్లే నాకు వచ్చింది. కెరీర్ తో పాటు కుటుంబ పరంగా నేను అనుభవిస్తున్న ప్రతి ఒక్కటి నా తండ్రి వల్లే అంటూ.. నా తండ్రి నా కోసం ఎంతో కష్టపడ్డాడని.. నేను ఆయనకు జన్మించడం అనేది ఖర్మ సిద్ధాంతమని సోనమ్ తెలియజేసింది. అందుకు తాను గర్వంగా ఫీల్ అవుతున్నట్లు కూడా ఆమె వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











