హీరోయిన్ ప్రైవేట్ రొమాన్స్ పిక్స్ వైరల్.. బెడ్‌రూంలో ఉక్కిరిబిక్కిరి చేసేలా!
ఇండియా వ్యాప్తంగా ఉన్న అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ ఎంతో మంది స్టార్లు తమ వారసులను పరిచయం చేశారు. అలా వచ్చిన వారిలో కొందరు అమ్మాయిలు బడా హీరోయిన్లుగా ఎదిగారు. అందులో అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ ఒకరు.
అదిరిపోయే అందం, అద్భుతమైన నటనతో తక్కువ సమయంలోనే సెన్సేషన్ అయిన ఈ చిన్నది.. చాలా కాలం పాటు వరుస చిత్రాలతో హవాను చూపించింది. అయితే, పెళ్లైన తర్వాత స్లో అయింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇలా తాజాగా సోనమ్ కొన్ని పిక్స్ వదిలింది. వాటిపై మీరే లుక్కేయండి!

ఎన్నో హిట్లతో స్టార్‌డమ్
సినిమాల మీద ఉన్న మక్కువతో సోనమ్ కపూర్ 2007లో వచ్చిన 'సవారియా' అనే చిత్రంతో హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది. ఇందులో అదిరిపోయే నటనను కనబరిచి ప్రేక్షకులను అలరించింది. దీనికితోడు ఈ చిత్రం భారీ విజయాన్ని కూడా సొంతం చేసుకుంది. ఆ తర్వాత కూడా సోనమ్ ఎన్నో హిట్లను అందుకుంది. తద్వారా బాలీవుడ్‌లో స్టార్‌గా మారిపోయింది.
ఆ టైమ్‌లో పెళ్లాడింది
స్టార్‌డమ్‌ను అందుకున్న తర్వాత సోనమ్ కపూర్ మరింత ఉత్సాహంతో సినిమాలు చేసింది. అలా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే ఈ బ్యూటీ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను పెళ్లి చేసుకుంది. అయితే, చాలా మంది హీరోయిన్లలా కాకుండా సోనమ్ కపూర్ వివాహం తర్వాత కెరీర్‌ను కంటిన్యూ చేస్తూనే వచ్చింది. కాకపోతే కాస్త నెమ్మదిగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంది.

తల్లవడంతో విరామం
చాలా ఏళ్ల పాటు వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన సోనమ్ కపూర్.. పెళ్లైన తర్వాత కొంత టైంలోనే ప్రెగ్నెంట్ అయింది. ఈ క్రమంలోనే ఆగస్టు 20, 2022న సోనమ్ పండంటి మగ బిడ్డకు తల్లైంది. అప్పటి నుంచి తన కుమారుడితోనే సోనమ్ సమయాన్ని గడుపుతోంది. దీంతో దాదాపు రెండేళ్ల నుంచి ఆమె సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. దీంతో ఆమె ఫ్యాన్స్ నిరాశ చెందారు.

రీఎంట్రీ ఇచ్చేసింది
2020లో సోనమ్ కపూర్ 'AK vs AK' సినిమాతో వచ్చింది. దీని తర్వాత ఆమె 'బ్లైండ్' అనే చిత్రంలో కూడా చేసింది. ఇది గత ఏడాది చివర్లో ఓటీటీలో విడుదల అయింది. ఇక, తల్లైన తర్వాత కెరీర్‌కు విరామం తీసుకున్న ఈ భామ.. రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలను మొదలు పెట్టేసింది. ఇందులో భాగంగానే ఇప్పుడిప్పుడే కొన్ని ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

అక్కడ ఫుల్ యాక్టివ్‌గా
సినిమాల్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి వరుసగా మూవీలు చేస్తూ వచ్చినా.. తల్లైన తర్వాత తెరకు దూరంగా ఉంటోన్నా.. సోనమ్ కపూర్ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. ఇక, వాటిలో తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. దీంతో ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

రొమాంటిక్ పిక్స్ షేర్
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ సోషల్ మీడియాలో తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా భర్తతో గతంలో తీసుకున్న రొమాంటిక్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో వీళ్లిద్దరూ ఉక్కిరిబిక్కిరి అయ్యేలా ముద్దులు ఇచ్చుకున్నవి కూడా ఉన్నాయి. దీంతో ఇవన్నీ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











