నగ్నంగా నటించినా నా భర్త అడ్డు చెప్పే రకం కాదు.. శర్వానంద్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా క్రేజ్ అందుకోవాలి అంటే చాలానే కష్టపడాలి. అయితే ఎంత స్టార్ గా ఎదిగినా కూడా హీరోయిన్స్ లైఫ్ లో పెళ్లి అనే మ్యాటర్ వచ్చింది అంటే దాదాపు కొన్ని హాట్ రోల్స్ కి ఎండ్ కార్డ్ పెట్టాల్సి ఉంటుంది. కానీ ఒక హీరోయిన్ మాత్రం తన భర్త అలాంటి డిమాండ్స్ పెట్టె రకం కాదని కామెంట్ చేస్తోంది. ఆమె ఎవరో కాదు.. ఒకప్పుడు తెలుగులో నటించిన సుర్వీన్ చావ్లా.

పెళ్లయితే..
పెళ్లి అంటే హీరోయిన్స్ దాదాపు నటనకు రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే అనే కామెంట్స్ వస్తుంటాయి. హీరోయిన్స్ కూడా చాలా వరకు నటనకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు. ఇకపోతే పెళ్లయినా కూడా కొంతమంది లిమిట్స్ దాటకుండా యాక్టింగ్ తో బిజీ అవుతున్నారు. అవరమైతే సపోర్టింగ్ రోల్స్ తో మెప్పిస్తున్నారు.

హాట్ హీరోయిన్
సుర్వీన్ చావ్లా గురించి అందరికి తెలిసే ఉంటుంది. శర్వానంద్ రాజు మహారాజు సినిమా ద్వారా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఆ భామ ఇండస్ట్రీలో కుదురుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అయితే ఎక్కువగా బాలీవుడ్ లోనే బిజీగా మారింది. అక్కడ హాట్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంది ఈ బ్యూటీ.

బిజీగా ఉన్నప్పుడే పెళ్లి..
ఇక సుర్వీన్ చావ్లా బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నపుడే పెళ్లి చేసుకుంది. హేట్ స్టోరీ 2 సినిమాలో అమ్మడి గ్లామర్ షో ఒక రేంజ్ లో క్లిక్కయ్యింది. ఆ తరువాత టీవీ షోలు వెబ్ సిరీస్ లు అంటూ బాలీవుడ్ లో బిజీబిజీగా గడుపుతున్న సమయంలో అమ్మడు 2015లో అక్షయ్ అనే ఒక బడా వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తరువాత కూడా అదే రేంజ్ లో నటిస్తోంది ఈ బ్యూటీ.
Recommended Video

నా భర్త అలాంటి వాడు కాదు.
ఇక నగ్నంగా నటించినా కూడా నా భర్త అడ్డు చెప్పే రకం కాదని సుర్వీన్ చావ్లా ఇటీవల స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. గతంలో ఈ బ్యూటీ భర్తకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమైందనే రూమర్స్ బాలీవుడ్ లో ఎక్కువగా వచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని నా భర్త తనకు దొరికిన ఒక గొప్ప అదృష్టం అంటూ పొగడ్తలతో ముంచెత్తింది. నటిగా నేను ఎంత హాట్ గా నటించినా కూడా ఆయన అర్థం చేసుకుంటారని కూడా క్లారిటీ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











