బాలయ్య హీరోయిన్ కి యాక్సిడెంట్.. రక్తమోడుతూ గుడికి.. అసలు ఏమైదంటే?
'ఆషిక్ బనాయా ఆప్నే'తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తెరంగేట్రం చేసి తొలిప్రయత్నంలోనే బాలీవుడ్‌లో సక్సెస్ అందుకున్నారు నటి తనుశ్రీ దత్తా. ఆ తరువాత తెలుగులో బాలకృష్ణతో వీర భద్ర సినిమా చేసిన ఆమె ఆ తర్వాత కేవలం బాలీవుడ్ కే పరిమితం అయింది. ఇక ఆ కొన్ని వ్యక్తిగత కారణాలతో బాలీవుడ్‌కు దూరమైన ఈ నటి దాదాపు 11 సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఇటీవల ఆమె విదేశాల నుంచి ముంబయికి కూడా వచ్చారు. అయితే ఆమెకు తాజాగా యాక్సిడెంట్ జరిగిన వార్త బయటకు వచ్చింది. ఆ వివరాలు

అమెరికా వెళ్ళిపోయి
అమెరికాలో పర్మనెంట్ సిటిజన్ షిప్ ఉన్న తనుశ్రీ దత్తా ఆమె పుట్టి పెరిగింది మాత్రం ఝార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్ పూర్ లోనే. 2004 లోనే ఆమె ఫెమీనా మిస్ ఇండియా యూనివర్స్ అవార్డు దక్కించుకుంది. ఆ ఏడాదే ఆమెకు హిందీలో 'ఆషిక్ బనాయా ఆప్నే' సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా హిట్ కావడంతోనే ఆమెకు బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీరభద్ర సినిమాలో హీరోయిన్ అవకాశం దక్కింది. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో మళ్ళీ బాలీవుడ్ కు వేల్లిపోయిన్ ఆమె 2010 వరకు సినిమాలు చేసి మళ్ళీ అమెరికా వెళ్ళిపోయింది.

మీటూ ఉద్యమానికి ఆధ్యురాలు
నిజానికి ఆమె సినిమాల ద్వారా కంటే కూడా మీటూ ఉద్యమం వల్లే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. భారతదేశంలో మీటూ ఉద్యమానికి ఆధ్యురాలు ఆమె అని చెప్పక తప్పదు. సినిమా షూటింగ్ సమయంలో సహా నటుడు నానాపటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని బాంబు పేల్చింది. ఆ తర్వాత తనుశ్రీ దత్తా స్ఫూర్తితో ఎందరో తమకు ఎదురైన భయానక పరిస్థితుల గురించి బయటకి వెల్లడించారు. ఇక దేశంలో మీటూ ఉద్యమం ఉధృతంగా మారిన సమయంలో ఆమె మళ్ళీ అమెరికా వెళ్లిపోయారు.

రీ ఎంట్రీ
ఇక ఆ మధ్య. ఆర్టిస్ట్‌గా నా కెరీర్‌ని తిరిగి ప్రారంభించాలనుకుంటున్నాను. ఇండస్ట్రీలోని కొందరు చెడ్డవారి వల్ల నేను పనిని మధ్యలో వదిలేయాల్సి వచ్చింది. కానీ బాలీవుడ్‌లో నాకు మంచి పేరు ఉంది, దాంతో ఇండస్ట్రీలో తిరిగి నా కెరీర్‌ని ప్రారంభించాలని భావించానని అంటూ రీ ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించింది. అందుకే ఇండియా తిరిగి వచ్చేస్తున్నానని ఆమె పేర్కొంది. మంచి చిత్రాలు, వెబ్ సిరీస్‌లలో నటించాలని అనుకుంటున్నాను' అని కూడా తనుశ్రీ దత్తా చెప్పుకొచ్చింది.

యాక్సిడెంట్‌కు గురై
ఇక తాజాగా తనుశ్రీ దత్తా యాక్సిడెంట్‌కు గురైందన్న వార్త తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో వీడియోలు-ఫోటోలు షేర్ చేస్తూ, తనుశ్రీ దత్తా తనకు రోడ్డు ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఆమె ఉజ్జయిని మహాకాల్‌ను సందర్శించేందుకు వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ చేదు అనుభవాన్ని తనుశ్రీ దత్తా సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన జీవితంలో తొలిసారి ఇలా జరిగిందని ఆమె చెప్పుకొచ్చారు. కానీ ఈ రోడ్డు ప్రమాదం వల్ల తన నమ్మకం మరింత బలపడిందని ఆమె పేర్కొంది. వాహనం బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని ఆమె తెలిపారు.

చిన్న గాయాలే
అయితే రోడ్డు ప్రమాదం జరిగినప్పటికీ, తనుశ్రీ దత్తా మహాకల్ దర్శనానికి చేరుకున్నారు. గుడి లోపలి నుంచి తీసిన వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఆమె తడబడుతూ నడుస్తూ కనిపించింది. ఈ ప్రమాదంలో కాలికి గాయమైంది. అంతే కాదు తనుశ్రీ దత్తాకు కొన్ని కుట్లు కూడా పడ్డాయని తెలుస్తోంది. ఇక చిన్న చిన్న గాయాలే కావడంతో ఆమెకు అయితే పెను ప్రమాదం తప్పింది.

రక్తమోడుతూనే
ఇక ప్రమాదంలో నటి మోకాలికి బలమైన గాయం అయినట్లు ఆమె షేర్ చేసిన ఫోటోలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయం తెలియగానే నటి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియా యూజర్లు తనుశ్రీ పోస్ట్‌పై వ్యాఖ్యానిస్తున్నారు మరియు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇక ఆమె రక్తమోడుతూనే దేవుడిని దర్శించుకున్నారు.


Click it and Unblock the Notifications











