ఇమ్రాన్ హష్మీతో బెడ్ సీన్లలో నటించి.. ఇప్పుడు అన్నయ్యను చేసింది
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తనుశ్రీ దత్త తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. నార్త్ ఆడియెన్స్ కు పరిచయం అవసరం లేని ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగులోనూ బాలయ్య సరనసన ఓ చిత్రంలో నటించి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. అయితే తనుశ్రీ దత్త మొదటి చిత్రంతోనే ఇండియాలో సెన్సేషన్ గా మారింది. ఆమె బోల్డ్ పెర్ఫామెన్స్ కు అందరి దిమ్మ తిరిగి పోయింది. ఇమ్రాన్ హష్మితో నటించిన ఆ చిత్రంపై తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తమ సంబంధంపైనా కూడా షాకింగ్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గ్గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
తనుశ్రీ దత్త సినీ ఎంట్రీ వివరాలు..
జార్ఖండ్ కు చెందిన జెమ్షెడ్ పుర్ లో తనుశ్రీ దత్త 1984 మార్చి 19న జన్మించింది. ఇక తొలుత మోడలింగ్ పై ఉన్న ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక 2005లో తన తొలిచిత్రం 'ఆషిక్ బనాయా ఆప్నే'తో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. తొలిచిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. అలాగే అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. కేవలం 2013 వరకు మాత్రమే సినిమాలు చేసి ఆ తర్వాత వెండితెరకు దూరమైంది. ఆ తర్వాత నుంచి మళ్లీ తిరిగి బిగ్ స్క్రీన్ పై కనిపించలేదు.

ఇమ్రాన్ హష్మితో రెచ్చిపోయి మరీ..
బాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ తనుశ్రీ దత్త బాలీవుడ్ లో తొలి చిత్రమే కిస్సర్ బాయ్, బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మితో కలిసి నటించింది. 'ఆషిక్ బనాయా అప్నే' చిత్రంలో తనుశ్రీ దత్త ఎలాంటి పెర్ఫామెన్స్ ఇచ్చిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో ఆషిక్ బనాయా సాంగ్ లో ఇమ్రాన్ హష్మితో ఏకంగా లిప్ లాక్, బెడ్ సీన్లలో నటించి ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. తన డేరిం్ పెర్ఫామెన్స్ తో ఇండియా మొత్తం పాపులర్ అవ్వడం విశేషం. ఆ తర్వాత ఇమ్రాన్ సరసన చాకొలెట్, గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్ వంటి చిత్రాల్లో నటించింది.
ఇమ్రాన్ హష్మితో ఉన్న సంబంధంపై..
తనుశ్రీ దత్త బాలీవుడ్ లో తక్కువ కాలమే వెండితెరపై నటించింది. తొలిచిత్రంతోనే భారీ సక్సెస్ ను అందుకున్నా కూడా పట్టుమని 10 ఏళ్లు కూడా సినిమాల్లో కనిపించలేకపోయింది. ఏదేమైనా తనుశ్రీ దత్త ఇమ్రాన్ హష్మితో 3 సినిమాల్లో నటించింది. ప్రతి చిత్రంలో వీరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ దక్కింది. దీంతో అప్పట్లో వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ ఉందంటూ పుకార్లు వచ్చాయి. కానీ దానిపై తాజాగా తనుశ్రీ దత్త రీసెంట్ గా స్పందించింది. ఇమ్రాన్ హష్మితో తనకు ఎలాంటి రిలేషన్ షిప్ లేదని, వారి మధ్య బ్రదర్ - సిస్టర్ రిలేషనే ఉందని చెప్పినట్టు బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. మొత్తానికి తనుశ్రీ దత్త కామెంట్స్ హాట్ టాపిక్ గ్గా మారింది.
పవన్ కళ్యాణ్ తో టాలీవుడ్ ఎంట్రీ..
ఇమ్రాన్ హష్మి ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటిస్తూనే ఉన్నారు. చివరిగా టైగర్ 3, గ్రౌండ్ జీరో వంటి చిత్రాలతో అలరించారు. ఇక తొలిసారిగా ఇమ్రాన్ హష్మి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజీత్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న ఓజీ చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం 2025 సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











