మెగాస్టార్ కి రుణపడి ఉంటా.. ఊర్వశీ రౌటేలా ఎమోషనల్!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దగా వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో టాప్ టు బాటమ్ ఎదిగిన వ్యక్తిగా చిరంజీవికి ఎంత రికార్డు ఉందో తెలిసిందే. అలనాటి హీరోల తర్వాత ఆయన రికార్డులే కనిపిస్తుంటాయి. అలాగే తోటి నటీనటులకు కూడా వీలైనంత వరకు సాయం చేయడం చిరంజీవికి చెందినదే. కరోనా సమయంలో.. అంతకు ముందు.. రీసెంట్ గా ఆరోగ్యం బాగాలేక తనని సంప్రదించిన సీనియర్ నటులకు మెగా ఫ్యామిలీ సాయం అందిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలాకు మెగాస్టార్ చిరంజీవి చేసిన సాయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవితో తను నటించిన సాంగ్ కు మంచి స్పందన లభించడం ఆనందంగా ఉందంటూనే.. మరోవైపు తన తల్లి ఆరోగ్యం బాగాలేనప్పుడు సాయం చేసిన చిరుకు రుణపడి ఉంటానని తెలిపింది. రీసెంట్ గా తన తల్లికి ఎడమ కాలు బాగా గాయపడిందని, ఎక్కడికెళ్లినా సరైనా ట్రీట్ మెంట్ అందక తను ఎంతో ఇబ్బంది పడిందని చెప్పింది. కానీ అదే సమయంలో చిరంజీవి గారు వెంటనే స్పందించి సాయం అందించారని తెలిపింది.

కోలకత్తాలోని అపోలో ఆస్పత్రి సిబ్బందితో సమస్యను వివరించారని తెలిపింది. ఆయనే స్పెషల్ కేర్ తీసుకొని వైద్యం అందేలా చూశారని చెప్పుకొచ్చింది. వైద్య సదుపాయాలు అయ్యాయ... మా అమ్మగారికి ఏం కాదని, ఆమె ఆరోగ్యంగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో భరోసా ఇచ్చారు. మేం ఎప్పటికీ చిరంజీవి నుంచి పొందిన సాయానికి రుణపడి ఉంటాం... అని గుర్తుచేసుకుంది. ఇక చిరంజీవి వీలైనంతగా తోటీ నటునటులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తనవంతుగా సాయం చేస్తూనే వస్తున్నారు.
ఇక ఇప్పటికీ బాస్ తన అభిమానులను, తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు నిత్యం కృషి చేస్తూనే ఉన్నారు. ఆరు పదుల వయస్సులోనూ సినిమాలపై ఉన్న మక్కువతో క్రేజీ ప్రాజెక్ట్స్ ను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. యంగ్ డైరెక్టర్స్ తో కలిసి వర్క్ చేస్తున్నారు. అలాగే దుమ్ములేపే సాంగ్స్ లలోనూ డ్యాన్స్ తో అదరగొడుతున్నారు. చివరిగా మెగాస్టార్ 'వాల్తేరు వీరయ్య'తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతో ఏకంగా రూ.230 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. చాలా రోజుల తర్వాత మెగాస్టార్ ఈ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద శివతాండవం చేశారు. అలాగే ఈ చిత్రంలో ఊర్వశీ రౌటేలాతో 'బాస్ పార్టీ'కి మాస్ స్టెప్పులేసిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఊర్వశీ రౌటేలా ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వరస పెట్టి సినిమాలు చేస్తున్నారు. 15 ఏళ్లకే మోడలింగ్ లో అడుగుపెట్టిన ఊర్వశీ సౌత్, నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. తెలుగు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ తో దుమ్ములేపుతున్న విషయం తెలిసిందే. 'వాల్తేరు వీరయ్య', 'ఏజెంట్', 'స్కంద', 'బ్రో'.. రీసెంట్ గా బాలయ్య 'డాకు మహారాజ్' చిత్రంలో 'దబిడి దిబిడి' సాంగ్ లో నటించిన విషయం తెలిసిందే. ఊర్వశీ నటించిన ప్రతి స్పెషల్ సాంగ్ హిట్ కావడం విశేషం.


Click it and Unblock the Notifications











