ఎంఎస్ సుబ్బులక్ష్మీలా విద్యాబాలన్.. ఆ గెటప్ వెనుక సీక్రెట్ ఏమిటంటే?

ప్రస్తుతం ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై బయోపిక్‌లు , యదార్ధ ఘటనలు హల్‌చల్ చేస్తున్నాయి. ప్రేక్షకులు కూడా వాటినే ఇష్టపడుతుండటంతో మేకర్స్ ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సినీతారలు, రాజకీయ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధులు, క్రీడాకారుల జీవితాలను బయోపిక్స్‌గా తీశారు సినీ జనాలు. తాజాగా దిగ్గజ గాయకురాలి బయోపిక్ దిశగా అడుగులు పడుతున్నట్లుగా ఉంది. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రతి ఉదయం దేవాలయాల వైపు వెళితే.. అక్కడ కంచు కంఠంతో సుప్రభాతం వినిపిస్తుంది. తన మధుర గాత్రంతో భగవంతుణ్ని మేలు కొలిపే ఆ స్వరం ఎవరిదో కాదు.. భారత సంగీత సామ్రాజ్ఞి, భారతరత్న డాక్టర్ ఎంఎస్ సుబ్బులక్ష్మిది. బాల్యం నుంచి తన చివరి శ్వాస వరకు సంగీతమే ఊపిరిగా బతికారు సుబ్బులక్ష్మీ. శాస్త్రీయ సంగీతానికి ఆమె ఎనలేని సేవ చేశారు. ఒక సినిమా డ్రామాకు ఏమాత్రం తగ్గని మలుపులు ఆమె జీవితంలో ఉన్నాయి.

Bollywood Actress Vidya Balan s tribute to legendary singer MS Subbulakshmi on her birth anniversary

తల్లిది దేవదాసి కులమైతే, తండ్రిది తమిళ బ్రాహ్మణ కుటుంబం. వయసుకొచ్చిన తర్వాత సుబ్బులక్ష్మీని కూడా తనలాగే మార్చాలని తల్లి ప్రయత్నించగా.. ఆమె పారిపోతుంది. అప్పటికే పెళ్లయి, పిల్లలున్న సదాశివం అనే వ్యక్తిని సుబ్బులక్ష్మీ పెళ్లాడారు. దాదాపు 57 ఏళ్ల పాటు అన్యోన్యమైన జీవితాన్ని గడిపారు. అనంతరం భర్త ప్రోత్సాహంతో సంగీత కచేరిలు, ప్రదర్శనలు, సాధన, ఆల్బమ్స్ చేసి సంగీత ప్రియులను అలరించారు.

శాస్త్రీయ సంగీతానికి ఆమె చేసిన సేవలకు గాను దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను కేంద్ర ప్రభుత్వం ఆమెకు ప్రదానం చేసింది. ఇది గాక పద్మభూషణ్, రామన్ మెగసెసే అవార్డు, పద్మ విభూషణ్, కాళిదాస్ సమ్మాన్ వంటి పురస్కారాలు ఆమెను వరించాయి. 88 ఏళ్ల వయసులో 2004 డిసెంబర్ 11న డాక్టర్ ఎంఎస్ సుబ్బులక్ష్మీ కన్నుమూశారు. ఆమె జీవితాన్ని బయోపిక్‌గా తెరకెక్కించాలని ఎన్నోసార్లు ప్రయత్నాలు జరిగాయి. అయితే ఈసారి ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సుబ్బులక్ష్మీ పాత్ర పోషించే నటి కూడా ఆల్రెడీ సెలెక్ట్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె ఎవరో కాదు విద్యాబాలన్. సోమవారం ఆ దిగ్గజ నటి జయంతి కావడంతో అచ్చం సుబ్బులక్ష్మీలా ముస్తాబైన విద్యాబాలన్ ఆమెకు నివాళులర్పించారు. పెద్ద బొట్టు, కొప్పులో మల్లెలు పెట్టుకుని వీణ మీటుతూ కనిపించారు. ప్రస్తుతం ఎంఎస్ సుబ్బులక్ష్మీ గెటప్‌లో విద్యాబాలన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నిజంగానే విద్యాబాలన్ .. ఎంఎస్ సుబ్బులక్ష్మీ క్యారెక్టర్ చేస్తున్నారా లేక అది పుకారేనా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Read more about: vidya balan ms subbulakshmi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X