Yami Gautam: ట్రీట్‌మెంట్ లేని వ్యాధి బారిన నితిన్ హీరోయిన్.. సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేస్తూ..

హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీ లో కూడా హీరోయిన్ గా అదృష్టాన్ని పరీక్షించుకున్న యామి గౌతమ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మొదట కొన్ని బ్రాండెడ్ యాడ్స్ లో కనిపించిన ఈ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. మోడల్ గా అప్పట్లో ఆమెకు భారీ స్థాయిలో క్రేజ్ ఉండడం వలన సినిమాల్లోకి రాకముందు యాడ్స్ లో ఆఫర్స్ వచ్చాయి. ఇక సినిమాల్లోకి యూ టర్న్ తీసుకున్న యామి గౌతమ్ అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోయింది. ఇక ఈ అమ్మడు ఇటీవల తనకున్న ఒక వ్యాధి గురించి చాలా ఓపెన్ గా వివరణ ఇచ్చింది. అంతేకాకుండా అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

 మొదట ఆ యాడ్ ద్వారా

మొదట ఆ యాడ్ ద్వారా

యామి గౌతం ప్రముఖ దర్శకుడు మహేష్ గౌతం కూతురు అని అందరికీ తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలో కూడా యామి గౌతమ్ పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును అందుకుంది. ఆమెకు మోడలింగ్ ప్రపంచంలో చాలా క్రేజ్ తగ్గింది. ఆమె అందం చూసి ఎన్నో ప్రముఖ ఫెయిర్నెస్ కంపెనీల యాడ్స్ లలో ఆఫర్స్ వచ్చాయి. ముఖ్యంగా ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ ద్వారా ఆమె చాలా క్రేజ్ అందుకుంది.

భాషతో సంబంధం లేకుండా..

భాషతో సంబంధం లేకుండా..

ఇక 2009లోనే ఒక కన్నడ సినిమా ద్వారా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన యామీ గౌతమ్ ఆ తర్వాత భాషలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. పంజాబీ తెలుగు హిందీ మలయాళం తమిళ్ అని తేడా లేకుండా మంచి ఆఫర్ ఎక్కడ వచ్చినా కూడా సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక తెలుగులో ఆమె చేసిన కొన్ని సినిమాలు అనుకున్నంత స్థాయిలో అయితే గుర్తింపును అందుకోలేదు.

తెలుగులో డిజాస్టర్స్..

తెలుగులో డిజాస్టర్స్..

2013లో గౌరవం సినిమాలో అల్లు శిరీష్ కు జోడిగా నటించింది.

ఆ తర్వాత తెలుగులోనే యుద్ధం అనే సినిమా చేసింది. ఇక నితిన్ హీరోగా వచ్చిన కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాలో కూడా గ్లామరస్ బ్యూటీగా కనిపించింది. ఇక ఆ తర్వాత ఎందుకో ఈ బ్యూటీ మళ్లీ తెలుగు సినిమాల వైపు చూడలేదు. తెలుగులో ఆమె చేసిన సినిమాలంఅయితే బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్స్ అయ్యాయి. ఇక 2016 తర్వాత యామీ వరుసగా బాలీవుడ్ సినిమాలతో బిజీ అయ్యింది. తమిళంలో ఆఫర్స్ వచ్చినప్పటికీ కూడా అటువైపు ఎక్కువగా అయితే ఫోకస్ చేయలేదు

 అరుదైన చర్మ వ్యాధి

అరుదైన చర్మ వ్యాధి

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో కొన్ని మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇక రీసెంట్ గా ఆమె చర్మ వ్యాధి గురించి కూడా చాలా ఓపెన్ గానే సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. 'కెరటోసిస్ పిలారిస్' అనే అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతున్నట్లు చెబుతూ.. ఎడిట్ చేయని.. ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఎన్నో ఏళ్లుగా ఈ వ్యాధితో బాధపడుతున్నను అంటూ దాచడానికి ఎంతో ప్రయత్నం చేశానని అది అయితే అందరూ అనుకునేంత భయంకరమైన వ్యాధి ఏమి కాదని తెలియజేసింది.

Recommended Video

MAA Elections: Prakash Raj VS Manchu Vishnu మంచు ఫ్యామిలీ కంటే నేనే మంచి తెలుగు మాట్లాడుతా..
ట్రీట్మెంట్ ఇంకా కనుక్కోలేదు..

ట్రీట్మెంట్ ఇంకా కనుక్కోలేదు..

ఇక చాలాసార్లు ఈ వ్యాధి గురించి బయటకు చెప్పడానికి కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చిందని చెప్పిన యామి గౌతమ్ నన్ను నేను ఆ విషయంలో చాలా ప్రశ్నిచుకునేదాన్ని అని పేర్కొంది. అలా మదనపడిన అనంతరం ధైర్యంగా అందరికీ చెబుతున్నాను అంటూ.. ఇంతవరకు తనకు వచ్చిన వ్యాధికి ట్రీట్మెంట్ కనుగొనలేదని అయినప్పటికీ కూడా ఏ మాత్రం కంగారు పడడం లేదంటూ యామి తెలియజేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X