Janvhi Kapoor: గ్లామర్ తో దిమ్మతిరిగేలా చేస్తున్న జాన్వీ.. అందరి ఫోకస్ అమెపైనే..
సాధారణంగా మొదట్లో సక్సెస్ చూసినవారు కూడా ఆ తర్వాత మరో డిజాస్టర్ అందుకుంటే ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కొందరు అయితే ఒక సినిమాకి మాయమవుతూ ఉంటారు. అయితే జాన్వికపూర్ మాత్రం ఇప్పటివరకు సరైన బాక్స్ ఆఫీస్ సక్సెస్ చూడలేకపోయినప్పటికీ కూడా ఇంకా తన క్రేజ్ పెంచుకుంటూనే ఉంటుంది. కేవలం గ్లామరస్ లుక్స్ తోనే అమ్మడు ప్రస్తుతం అవకాశాలు అందుకుంటుంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. రీసెంట్ గా మరోసారి అమ్మడు స్టన్ అయ్యేలా దర్శనమిచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
సక్సెస్ కాకపోయినా..:అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ జాన్వీ కపూర్. ఈ అమ్మడు ధడక్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నటిగా పరవాలేదనిపించుకుంది. తరువాత గుంజన్ సంక్షేనాతో బయోపిక్ చేసి డేర్ చేసింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే నటిగా మంచి మార్కులే పడ్డాయి. ఇప్పటి వరకు జాన్వీ కపూర్ బాలీవుడ్ అరడజను వరకు సినిమాలు చేసింది.

తెలుగులో కూడా వరుస అవకాశాలు:అయితే వాటిలో పెద్ద సక్సెస్ లు అందుకోలేదు. కమర్షియల్ హీరోయిన్ గా కూడా జాన్వీ కపూర్ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. అయిన కూడా తెలుగులో ఎన్టీఆర్ కి జోడీగా దేవర మూవీతో తెరంగేట్రం చేస్తోంది. పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అలాగే అఖిల్ హీరోగా తెరకెక్కబోయే ధీర చిత్రంలో కూడా జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా..:ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ సినిమాలలో కాస్తా పద్ధతైన పాత్రలలో కనిపిస్తోన్న సోషల్ మీడియాలో మాత్రం హీట్ పుట్టిస్తూ ఉంటుంది. రెగ్యులర్ గా హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకి వలపుల బాణాలు విసురుతూ ఉంటుంది. జాన్వీ కపూర్ అందాలకి ఫిదా కానివారు ఉండరు. ఏ మాత్రం సంకోచం లేకుండా తన అందాలని నిండుగా చూపిస్తూ ఫాలోవర్స్ కి నేత్రానందం అందిస్తూ ఉంటుంది.
అందుకే ఆ రేంజ్ లో ఫాలోవర్స్:ఈ కారణంగానే ఇన్ స్టాగ్రామ్ లో జాన్వీ కపూర్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఒక్క ఫోటో పెడితే లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఇన్ స్టాగ్రామ్ ద్వారా కాస్ట్యూమ్స్ ని ప్రమోట్ చేస్తూ ఈ అమ్మడు రెండుచేతులా సంపాదిస్తోంది. అందుకే ఎప్పటికప్పుడు డిఫరెంట్ మోడల్ కాస్ట్యూమ్స్ తో కలర్ ఫుల్ ఫోటోలని షేర్ చేస్తూ ఉంటుంది.
మరోసారి స్టన్ అయ్యేలా ఘాటైన స్టిల్:తాజాగా మరోసారి జాన్వీ కపూర్ ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన గోల్డ్ కలర్ ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ ధరించి తళుకులీనుతోంది. ఏంజిల్ లా ఈ వస్త్రాలలో జాన్వీ కపూర్ మెరిసిపోతూ ఉండటం విశేషం. ఎద అందాలని నిండుగా చూపిస్తూ దివి నుంచి దిగివచ్చిన అప్సరాలా జాన్వీ కపూర్ అందాలతో మైమరపిస్తోంది. ఈ ఫోటోలని 10 లక్షల మందికి పైగా లైక్ చేయడం విశేషం.


Click it and Unblock the Notifications











