Aisha Sharma: సమ్మర్ స్పెషల్ డ్రెస్‌లో అయేషా సోకుల విందు.. చూస్తే కూలైపోవాల్సిందే!
బాలీవుడ్ హాట్ బ్యూటీ అయేషా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవ్చు. కానీ సోషల్ మీడియాను ఎక్కువగా ఫోల్ అయ్యే వారికి అయేషా శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎప్పుడూ గ్లామరస్ ఫొటోలతో కుర్రకారుకు విందు ఇచ్చే ఈ అమ్మడు.. తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేధికగా మరికొన్ని ఫొటోలు వదిలింది. ముఖ్యంగా సమ్మర్ స్పెషల్ డ్రెస్ వేసుకుని సోకులు ఆరబోసింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
చిరుత సినిమా హీరోయిన్ నేహా శర్మ చెల్లెలే ఈ క్యూట్ బ్యూటీ అయేషా శర్మ. అందంలో అక్కను మించిపోయిన ఈమె.. ముందుగా మోడల్ గా కెరియర్ ప్రాభించింది. ఆ తర్వాత నటిగా కూడా మారిన ఈ అమ్మడు.. ముందు ఆయుష్మాన్ ఖురానా మ్యూజిక్ వీడియోల్లో కనిపించింది. ఆ తర్వాత అంటే 2018వ సంవత్సరంలో హిందీ యాక్షన్ థ్రిల్లర్ సత్యమేవ జయతే సినిమాలో నటించి మెప్పించింది.

అంతే కాదండోయ్ లాక్మే, పెప్సీ, క్యాంపస్ షూస్ వంటి పెద్ద పెద్ద బ్రాండ్ ల అడ్వర్ టైజ్ మెంట్లలో కనిపించింది. 2016లో కింగ్ ఫిషర్ క్యాలెండర్ గర్ల్స్ లో కూడా ఎంపికైంది. చిరుత సినిమాలో హీరోయిన్ గా నటించిన నేహా శర్మ సోదరియే ఈ అయేషా శర్మ. అతితక్కువ కాలంలోనే ఈ హాట్ క్యూటీ బోల్డ్ యాక్టరస్ గా పేరు తెచ్చుకుంది. ఎప్పుడూ సినిమాలు, వీడియోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన అందమైన ఫొటోలను షేర్ చేస్తూ.. కుర్రకారుకు హాట్ ట్రీట్ ఇస్తుంది. అలాగే తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేధికగా సమ్మర్ స్పెషల్ డ్రెస్ వేసుకుని సోకులు ఆరబోసింది. వైట్ కలర్ డీప్ నెక్ టీషర్ట్ వేసుకుని అందాలు చూపించింది.

తెలుపు రంగు టీషర్ట్ వేసుకుని లైట్ బ్లూ కలర్ జీన్స్ స్టైల్ చేసింది. ఓ స్టూల్ పై కూర్చొని అదిరిపోయే ఫోజులు పెట్టింది. ఎలాంటి జ్యువెల్లరీ వేసుకోకపోయినా చాలా అందంగా కనిపిస్తోంది. అయేషా శర్మ షేర్ చేసిన ఈ ఫొటోలు చూసిన అభిమానులు.. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా కామెంట్లు చేస్తున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ చెప్పుకొస్తున్నారు. ఎవరు ఏమన్నా అయేషా శర్మ సమ్మర్ ట్రీట్ మాత్రం అదిరిపోయింది. ఈ ఫొటోలను మీరు కూడా ఓసారి చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











