twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్ పై కన్నేసిన మరో బాలీవుడ్ బ్యూటీ..

    |

    సినిమా ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్ అని గుర్తింపు తెచ్చుకోవడం కన్నా టాలెంటెడ్ ఆర్టిస్ట్ అని ఒక పేరు తెచ్చుకుంటే చాలు ఏ భాషలో అయినా అవకాశాలు దక్కుతాయి. ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అలాంటి నటీమణులు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఈ మధ్య భూమి పడ్నేకర్ అనే హాట్ బ్యూటీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

    మోడల్ గా ఫ్యాషన్ వరల్డ్ లో ఎంతో గుర్తింపు దక్కించుకున్న భూమి పడ్నేకర్ బాలీవుడ్ లో అడుగుపెట్టిన తరువాత తన క్రేజ్ ని మరీంత పెంచుకుంది. ఏ సినిమా చేసినా అందులో ఎంతో కొంత వినూత్నంగా కనిపించడానికి ట్రై చేస్తుంది. గత ఏడాది బాలా సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న భూమికి ఇప్పుడు సౌత్ నుంచి కూడా కొన్ని ఆఫర్స్ వస్తున్నాయట. కానీ ఈ భామ అంత ఈజీగా ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. బాలీవుడ్ నుంచి వచ్చిన కొంతమంది నటీమణులు ఇక్కడ కూడా సక్సెస్ అవుతున్నారు.

    Bollywood beauty Bhumi Pednekar target on tollywood offers

    ఇక భూమి పడ్నేకర్ కూడా టాలీవుడ్ లో ప్రయోగాత్మక పాత్రల్లో నటించాలని ఆశపడుతోందో. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో త్వరలో తాను కూడా సౌత్ ఇండస్ట్రీలో సందడి చేయబోతున్నట్లు ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. మంచి టైమ్ చూసి సరైన కథతో ఎంట్రీ ఇస్తానని చెప్పింది. ప్రస్తుతం టాలీవుడ్ లో అయితే హీరోయిన్స్ కొరత ఉంది. న్యూ గ్లామర్ బ్యూటీస్ కోసం దర్శక నిర్మాతలు చాలా సెర్చ్ చేస్తున్నారు. అందులో భూమి పడ్నేకర్ ని ఇప్పటికే చాలా మంది సంప్రదించినట్లు తెలుస్తోంది. మరి ఈ బ్యూటీ తెలుగులో ఎలాంటి సినిమాలు చేస్తుందో చూడాలి.

    English summary
    Bollywood actress Bhumi Pednekar is quite a familiar name as she has been choosing good scripts in recent times. Apart from doing heroine roles, she is impressive in performance-oriented characters too. Meanwhile, in a recent interview, Bhumi expressed her interest in South cinema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X