Janhvi Kapoor: జాబిలమ్మలా మెరిసిపోతున్న జాన్వీ కపూర్.. చీరలో చింపేసిందిగా!
అలానాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి అందరికీ తెలిసిందే. అచ్చం అమ్మలాగే అద్భుతమైన అందాలను కల్గి ఈ హాట్ బ్యూటీ కుర్రకారు గుండెల్లో ఎప్పటికప్పుడు హీటు పుట్టిస్తూనే ఉంటుంది. ధడక్ సినిమాతో 2018లో సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది. ముఖ్యంగా ధడక్ చిత్రం తర్వాత ఘోస్ట్ స్టోరీస్, అంగ్రేజీ మీడియం, గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్, రూహి, గుడ్ లక్ జెర్రీ, మిలి, బావాల్, మిస్టర్ అండ్ మిస్సెస్ మహి సినిమాల్లోనూ కనిపించి మెస్మరైజ్ చేసింది.
తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 30వ చిత్రం దేవరలో నటిస్తోంది. మొదటి సినిమాలోనే స్టార్ హీరోతో నటించబోతున్న ఈమెకు తెలుగులో ఇదే మొదటి చిత్రం. ఓవైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది.

అందులో వైలెట్ కలర్ శారీ కట్టుకొని హొయలు పోయింది. చక్కనమ్మ చీర కడితే చూసేందుకు రెండు కళ్లూ సరిపోవట్లేదు. జాన్వీ మామూలుగానే చాలా అందంగా ఉంటుంది. ఇక చీర కడితే అయితే అచ్చం దేవ కన్యలాగే కనిపిస్తోంది. ముఖ్యంగా స్లీవ్ లెస్ బ్లౌజు వేసుకున్న ఈమె సన్నని చీరను స్టైల్ చేసింది. ఎద అందాలతో పాటు నడుము అందాలను కూడా చూపిస్తూ.. కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది.
ఈ ఫొటోలను షేర్ చేసిన జాన్వీ కపూర్ తనకు తానే మేకప్ వేసుకున్నట్లు ఇన్ స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. మేకప్ సొంతంగా వేసుకుని చాలా ముద్దుగా కనిపిస్తోంది. మేకప్ ఆర్టిస్ట్ సాయం లేకుండా మేకప్ వేసుకున్న ఈ హాట్ బ్యూటీ అందాలను అంతా చూసి ఫిదా అయిపోతున్నారు. మీరూ ఓసారి జాన్వీ అందాలపై ఓ లుక్కేయండి. ఫుల్లుగా ఆస్వాదించండి.
సినీ రంగంలోకి ప్రవేశిచిన ఇదేళ్ల పూర్తి కూడా కాకముందే ఒక్కో ప్రాజెక్టు కోసం 4 నుంచి 5 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటుందట జాన్వీ కపూర్. సినిమాల్లో చేస్తూ ఏడాదికి 10 కోట్ల వరకూ సంపాధిస్తుందని టాక్ నడుస్తోంది. అంతే కాకుండా ఈ అమ్మడుకు ఉన్న క్రేజ్ కు పెద్ద ఎత్తున అవకాశాలు వస్తాయని అనుకుంటున్నారు. తన తల్లిలాగే చాలా సినిమాల్లోనే ఛాన్సులు కొట్టేసి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటుందని భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











