తేజ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్!
దర్శకుడు తేజ ప్రస్తుతం యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నాడు. ఆసక్తికరమైన కథా నేపథ్యంలో ఈ చిత్రం తెరక్కబోతోంది. నేనే రాజు నేనే మంత్రి చిత్రం తరువాత తేజ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఈ చిత్రంలో శ్రీనివాస్ కు జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ కు కూడా ఛాన్స్ ఉంది. సెకండ్ హీరోయిన్ రోల్ కోసం తేజ బాలీవుడ్ హీరోయిన్ మన్నార చోప్రాని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

చాలా కాలం వరకు ప్లాపుల్లో ఉన్న తేజ నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో తిరిగి పుంజుకున్నాడు. ఆ తరువాత ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం దక్కినా అనుకోని కారణాల వలన ఆ చిత్రం నుంచి తప్పుకున్నాడు.
teja kajal aggarwal bellamkonda srinivas mannara chopra తేజ కాజల్ అగర్వాల్ బెల్లంకొండ శ్రీనివాస్ మన్నార చోప్రా


Click it and Unblock the Notifications