విమానంలో స్టార్ హీరోయిన్ కి చేదు అనుభవం.. అలాంటి పనితో యంగ్ బ్యూటీ ఆగ్రహం

సినిమా పరిశ్రమకి చెందిన నటీనటుల జీవితాలు అంత సింపుల్ గా ఏమి ఉండవు. చిన్న చిన్న పాత్రలు చేసే నటీనటులకే బయట ఆడియెన్స్ లో మంచి ఆదరణ ఉంటుంది. వాళ్ళకి వారు అభిమానులు కాకపోయినప్పటికీ సినిమాలోనో లేదా ఎంటర్టైన్మెంట్ రంగంలో మంచి ఫేమ్ వస్తే వారితో ఫోటో అయినా దిగాలి అనుకుంటారు. అంతెందుకు ఈరోజుల్లో కూడా చిన్న చిన్న ఊర్లలో ప్రోగ్రామ్స్ కి వెళ్లే యాంకర్లకే ఊపిరి ఆడనివ్వరు.

మరి అలాంటిది సినీ పరిశ్రమలో ఉన్న వారి పరిస్థితి ఇంకా దారుణంగానే ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఒకవేళ కొంచెం ఫేమ్ ఉంటే అది మరింత క్లిష్టంగా ఉంటుంది అని చెప్పాలి. అందుకే మన స్టార్ లు దాదాపు ఇండియాలో బయట ప్రదేశాల్లో తిరగలేక కొంచెం పీస్ ఫుల్ గా ఉండాలని బయట దేశాలకి వెళ్ళిపోతారు. ఇక మన దగ్గర జెనరల్ ఆడియెన్స్ తో ఏ చిన్న మిస్టేక్ జరిగినా వెంటనే వార్తల్లోకి ఎక్కేస్తారు.

bollywood beauty sara ali khan controversy with air hostess

ఇక ఈ సోషల్ మీడియా యుగంలో అయితే వార్తల్లోకి వెళ్లే ముందే మొత్తం పాకేస్తారు. ఇప్పుడు బయట ఆడియెన్స్ లోనే ఓ యంగ్ బ్యూటీకి అది కూడా బాలీవుడ్ లో మంచి ఫేమ్ ఉన్న హాట్ బ్యూటీకి చేదు అనుభవం ఎదురయ్యింది. బాలీవుడ్ మార్కెట్ లో ఉన్నటువంటి యంగ్ భామలలో హాట్ బ్యూటీ సారా అలీ ఖాన్ కూడా ఒకరు. మరి ఈమె సోషల్ మీడియాలో ఎప్పటికపుడు తన గ్లామ్ షో తో అదరగొడుతూ ఉంటుంది.

అలాగే నటిగా కూడా పలు చిత్రాల్లో నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది. అయితే ఈమె తాజాగా ఓ ఫ్లైట్ ప్రయాణం చేయాల్సి వచ్చింది. కానీ అందులో ఎయిర్ హోస్టర్స్ తో గొడవకి దిగిన కొన్ని ఫోటోలు వీడియోలు వైరల్ గా మారాయి. ఆమె ఫ్లైట్ లో మంచి కాస్ట్లీ డ్రెస్సింగ్ తో ప్రయాణం చేస్తుండగా ఆమె డ్రెస్ పై పొరపాటున ఎయిర్ హోస్టర్స్ సర్వ్ చేస్తున్నపుడు జ్యూస్ ఆమె చాతి భాగంపై పడిపోయి డ్రెస్ పాడయిపోయింది.

దీనితో తన ఖరీదైన డ్రెస్ పాడైపోయింది అని ఆమె వాగ్వాదానికి దిగిందట. దీనితో బాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు ఈమె ఫోటోలు వీడియోలు వైరల్ గా మారాయి. అయితే ఇది బాగా గమనించిన కొందరు ఇదంతా ఏదో సెటప్ లా ఉందని సారా సరిగ్గా యాక్టింగ్ చెయ్యలేదు అటు సెటైర్స్ వేస్తున్నారు. కాగా ఈమె బాలీవుడ్ లో కూలీ నెంబర్ 1, మన తెలుగు హిట్ సినిమా ఎన్టీఆర్ నటించిన టెంపర్ రీమేక్ "సింబా" లో నటించింది.

అలాగే రీసెంట్ గా ఒక బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ "మర్డర్ ముబారక్" సినిమాలో కూడా రెచ్చిపోయింది. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉండగా ఈ ఏడాదిలోనే 'ఏ వాటన్ మేరే వాటన్' అనే సినిమాలతో పలకరించింది. ఇక వీటి తర్వాత ఇప్పుడు మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇలా ఫుల్ బిజీగా బాలీవుడ్ లో గడిపేస్తుంది. తన కో స్టార్స్ జాన్వీ కపూర్, అనన్య పాండేలు ఆల్రెడీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. మరి ఈమె ఎప్పుడు ఇస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X