48 ఏళ్ల వయసులోనూ గ్లామర్ షో చేస్తున్న మత్సకన్య.. అందాలు మామూలుగా లేవుగా!
మత్స్యకన్య.. ఈ పేరు వినగానే చాలా మంది తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో బాలీవుడ్ హాట్ బ్యూటీ శిల్పా శెట్టి మెదులుతుంది. సాహస వీరుడు సాగర కన్య సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ... అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది. ముఖ్యంగా 1993లో బాజీగర్ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లో కాలు మోపింది. మొదటి సినిమాతోనే అద్భుతమైన నటన కనబర్చి ఫిల్ం ఫేర్ ఉత్తమ సహాయనటిగా అవార్డు అందుకుంది. మొదటి సినిమానే హిట్టు కావడంతో ఆ తర్వాత ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి.
ఇక ఆ తర్వాత ఏడాది అంటే 1994 నుంచి ఏడాది మూడు, నాలుగు చిత్రాలు చేస్తూ దూసుకెళ్లింది శిల్పాశెట్టి. కేవలం హిందీలోనే కాకుండా తమిళ, తెలుగు, కన్నడ భాషల్లోనూ నటించి మెప్పించింది. 2010 వరకు ఎన్నెన్నో చిత్రాల్లో నటించి అదరగొట్టింది. అయితే 2009లో బిజినెస్ మానే రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుందీ ముద్దుగుమ్మ. ఇక పెళ్లి తర్వాత నుంచి శిల్పా శెట్టి సినిమాలు చేయడం మానేసింది. సినీ రంగానికి దూరంగా ఉంటూ... పర్సనల్ లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. భర్త ఇద్దరు పిల్లలతో కలిసి హ్యాపీ లైఫ్ సాగిస్తుంది.

ఓవైపు తల్లిగా, భార్యగా బాధ్యతలు చక్కదిద్దుతున్న శిల్పా శెట్టి... సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందమైన హాట్ బాట్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తుంటుంది. అంతేకాకుండా తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అందమైన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట షేర్ చేసింది. అందులో అదిరిపోయే ఔట్ ఫిట్ లో కనిపించి అందరి చేత ఆహా అనిపించుకుంటోంది.
ముఖ్యంగా జీన్స్ వేసుకొని ఓ పార్టీకి హాజరు అయింది. బ్లాక్ కలర్ ఫుల్ హ్యాండ్స్ టైట్ టీషర్టు వేసుకున్న శిల్పా శెట్టి.... బెల్ బాటమ్ బ్లూ కలర్ జీన్స్ స్టైల్ చేసింది. అలాగే చేతులకు గ్లౌజులు వేసుకొని బ్లాక్ కలర్ చిన్న హ్యాండ్ బాగ్ పట్టుకొని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం 48 ఏళ్ల వయసు కల్గిన ఈ హాట్ బ్యూటీ.. చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది. ఇంత వయసు వచ్చినా, ఇద్దరు పిల్లల తల్లి అయినా అందాలు అయితే ఏమాత్రం తగ్గలేదు. చాలా ఫిట్ గా అందంగా కనిపిస్తోంది శిల్పా శెట్టి. ఈమె అందాలకు నెటిజెన్లు ఫిదా అయిపోతున్నారు.
నీ అందాలను చూసి తట్టుకోలేకపోతున్నాం శిల్పా జీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు అయితే అచ్చం పదహారేళ్ల పడుచులా కనిపిస్తున్నావంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మీరూ ఓసారి శిల్పా శెట్టి అందమైన హాట్ ఫొటోలను చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం.


Click it and Unblock the Notifications











