Yami Gautam: "ఆస్కార్ అవార్డులు షేక్ ఫిల్మీ అవార్డుల షో.. అందుకే వెళ్లడం మానేశా"
బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే ఆర్టికల్ 370 సినిమాలో నటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం సినీ ప్రియులందరూ ఈమెను అభినందిస్తుండగా.. ఆమె మాత్రం గట్టి షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంపైనే షాకింగ్ కామెంట్లు చేసింది. ఆస్కార్ అవార్డులు.. ఫేమ్ ఫిల్మీ షో అంటూ వ్యాఖ్యానించింది. అలాగే తాను ఈ అవార్డుల ప్రధానోత్సవానికి ఎందుకు వెళ్లట్లేదో కూడా తెలిపింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
2009లో ఉల్లాస ఉత్సాహ అనే సినిమాతో కన్నడ సినీ రంగంలో అడుగు పెట్టిన ఈమె ఆ తర్వాత పంజాబీ, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో సినిమాలు చేసింది. ఇలా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో నువ్విలా సినిమా చేసింది. ఆ తర్వాత గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కల్యాణ్ వంటి చిత్రాలు కూడా చేయగా.. అనుకున్న స్థాయిలో హిట్ కొట్టలేకపోయింది. కానీ తన అందం, అభినయంతో తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. ప్రస్తుతం ఈమె ఆర్టికల్ 370 అనే సినిమా చేసింది.

వివాదాస్పద కథాంశంతో వచ్చిన ఈ సినిమాకు మొదట్లో పలు సమస్యలు ఎదురుకాగా.. ఇటీవలే విడుదల అయింది. ముఖ్యంగా ఈ సినిమాలో ఆమె నటనకు గాను అందరూ మంచి మార్కులే వేస్తున్నారు. సోషల్ మీడియా వేధికగా ఈమెను మెచ్చుకునే వారి సంఖ్య చాలా ఎక్కువైంది. ఇంది ఆమె అకౌంట్ చూస్తే పూర్తిగా అర్థం అవుతుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎక్స్ వేధికగా షాకింగ్ ట్వీట్ చేసింది. ఆస్కార్ అవార్డులపై సెన్సేషనల్ కామెంట్లు చేసింది.
ముఖ్యంగా ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవాన్ని ఫేక్ ఫిల్మీ షో అని ఎక్స్ వేధికగా యామీ గౌతమ్ చెప్పుకొచ్చింది. ఈ అవార్డులపై తనకు నమ్మకం లేకపోవడం వల్లే.. గత కొన్ని సంవత్సరాలుగా తాను వాటికి హాజరు కావట్లేదని చెప్పింది. అయితే ఈ రోజు మాత్రం అంటే 2024 ఆస్కార్ అవార్డుల్లో.. తనకు చాలా సంతోషాన్ని ఇచ్చే ఓ వార్త కనిపించిందని వివరించింది. గ్లోబల్ ప్లాట్ ఫారమ్ లో ఓప్పెన్ హైమర్ ఫేం సిలియన్ మర్ఫీ అవార్డు అందుకోవడం సంతోషంగా నిలిచిందన్నారు.
ముఖ్యంగా సిలియన్ మర్ఫీ ప్రతిభ వల్లే అసాధారణ నటుడికి ఈ పురస్కారం రావడం చూసి నిజంగా సంతోషంగా ఉన్నాను అనీ యామీ గౌతమ్ వెల్లిడించింది. అలాగే ఓప్పెన్ హైమర్ నటుడు సిలియన్ మర్ఫీని ట్యాగ్ కూడా చేసింది. కంగ్రాట్స్ అంటూ చెప్పుకొచ్చింది. అయితే దీనిపై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఆస్కార్ అవార్డులపైనే యామీ గౌతమ్ ఇలాంటి కామెంట్లు చేయడంతో అంతా షాక్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











