Janhvi Kapoor Remuneration: ఎన్టీఆర్ సరసన నటించేందుకు జాన్వీ కపూర్ ఎన్ని కోట్లు పుచ్చుకుందంటే?

RRR సినిమాతో ప్రపంచం దృష్టిని ఆకట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ తాజాగా మరో అద్భుతమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా కొరటాల శివ దర్శకత్వంలో కచ్చితంగా హిట్టు కొట్టాలనే కసితో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు, బాలీవుడ్ హాట్ బ్యూటీ.. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఆమె తెలుగులో చేస్తున్న తొలి చిత్రం ఇదే. అయితే ఈ సినిమాలో నటించేందుకు ఆమె ఎంత పారితోషికం తీసుకుంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై కోసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. అలాగే అనిరుథ్ సంగీతం అందిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా కనిపించబోతున్నారు. అలాగే షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, నరేన్, ప్రకాశ్ రాజ్, చైత్ర రాయ్, అభిమన్యు సింగ్, కళైరసన్ లు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.

Bollywood Beuty Janhvi Kapoor Remuneration For Devara Movie Check Details

అద్భుతమైన హై ఓల్టేజ్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే కొన్ని పోస్టర్లు విడుదల అయ్యాయి. అలాగే ఇటీవల గ్లింప్స్ కూడా రిలీజ్ అయింది. ఇది చూస్తుంటే సినిమా అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్.. పద్ధతైన తెలుగు అమ్మాయిలో దర్శనం ఇవ్వబోతున్నట్లు పోస్టర్లు చూస్తుంటే తెలుస్తోంది. లంగావోణీ కట్టుకుని ఈ సినిమాలో ఆమె సందడి చేయనున్నట్లు అర్థం అవుతుంది.

అయితే దేవర చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ పక్కన నటించేందుకు గాను జాన్వీ కపూర్ భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ తీసుకుంటుందట. ఒక్క పార్టు కోసమే ఆమె 6 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటుందట. అయితే ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కించబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే మరి పార్ట్ 2లో కూడా ఈమె కనిపిస్తుందా, సీక్వెల్ లో నటించేందుకు ఇంకెంత తీసుకుంటుందనేది మాత్రం ఇంకా తెలియదు.

Bollywood Beuty Janhvi Kapoor Remuneration For Devara Movie Check Details

2024 ఏప్రిల్ 5వ తేదీన ఈ సనిమా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. 120 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్టు కొడుతుంది, ఎంత మేర కలెక్షన్లు వసూలు చేస్తుందనేది తెలియాలంటే మాత్రం ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X