Janhvi Kapoor Remuneration: RC16 కోసం జాన్వీ కపూర్ ఎన్నికోట్ల పారితోషికం తీసుకుంటుందో తెలుసా?
RRR సినిమాతో ప్రపంచం దృష్టిని ఆకట్టుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ తర్వాత మరో కొత్త ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ముఖ్యంగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో కచ్చితంగా హిట్టు కొట్టాలనే కసితో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు, బాలీవుడ్ హాట్ బ్యూటీ.. జాన్వీ కపూర్ హీరోయిన్ గా తీసుకున్న గురువారం రోజే ప్రకటించారు.
అయితే జాన్వీ కపూర్ కు తెలుగులో ఇది రెండో సినిమా. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి దేవర సినిమాలో నటిస్తోంది. రెండో సినిమాకే ఈ ముద్దుగుమ్మ భారీగా రెమ్యునరేష్ పుచ్చుకుంటోందని టాక్ నడుస్తోంది. మరి ఈ హాట్ బ్యూటీ రామ్ చరణ్ హీరోగా రాబోతున్న అతడి 16వ సినిమాకు ఎంత మొత్తంలో పారితోషికం తీసుకుంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తొలి చిత్రం ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన దర్శకుడు బుచ్చిబాబు రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నారు. ఇది రామ్ చరణ్ కు 16వ సినిమా కావడంతో దీనికి RC16 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత రామ్ చేయబోయే RC16ను లెజెండరీ రెజ్లర్ కోడి రామ్మూర్తి నాయుడి బయోపిక్ గా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.
ఇప్పటికీ ప్రో ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ స్పోర్ట్ డ్రామాలో హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోగా.. ఈమె చెర్రీ సరసన నటించేందుకు గాను భారీ మొత్తంలోనే రెమ్యునరేష్ తీసుకుంటుందట. ఈ సినిమా కోసం జాన్వీ మొత్తంగా ఆరు కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకుంటుందట. దీనిపై సరిగ్గా క్లారిటీ లేకపోయినప్పటికీ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాలో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యాసలో కనిపించనున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా శ్రీకాకుళంలో పుట్టిన కోడి రామ్మూర్తి నాయుడు.. ఆ తర్వాత విజయనగరంలో పెరిగారు. 20వ శతాబ్దపు తొలి నాళ్లలో ఈయన గొప్ప రెజ్లర్ గా పేరు పొందాడు.ఒంటి చేత్తో రైల్ ఇంజిన్‌ను ఆపారని, ఏనుగును మోసుకెళ్లగల బలశాలి అనే పేరు ఉంది. కోడి రామ్మూర్తి నాయుడు మద్రాసులోని వ్యాయామశాలలో శిక్షణ తీసుకుని తిరిగి విజయనగరానికి వచ్చి అక్కడ వ్యాయామ శిక్షకుడిగా పని చేశారు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ కథ సాగుతుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











