అర్జున్ రెడ్డి భామకు బంపర్ ఆఫర్.. ఇక అతగాడితో ముద్దుల వర్షమే!
'అర్జున్ రెడ్డి' సినిమాతో తెలుగు చిత్రసీమలో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది హీరోయిన్ షాలినీ పాండే. విజయ్ దేవరకొండ జోడీ ముద్దుల్లో మునిగిపోతూ యూత్ ఆడియన్స్‌కి మైకం తెప్పించింది. తొలి సినిమాతో తన నటనా ప్రతిభను చాటుకుంది. అయితే ఆ తర్వాత ఆమెకు ఆశించిన మేర అవకాశాలు దక్కలేదు.
అడపాదడపా తెలుగు, తమిళ చిత్రాల్లో కనిపించినప్పటికీ పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. తెలుగులో కళ్యాణ్ రామ్ సరసన ఇటీవలే 118 సినిమాలో చేసినా ప్రయోజనం లేదు. ఈ తరుణంలో తమిళ్‌లో '100 పర్సెంట్ లవ్' రీమేక్‌లో నటించి తిరిగి ట్రాక్ ఎక్కే ప్రయత్నం చేసింది షాలినీ. ఈ మేరకు అనుష్క 'నిశ్శబ్దం' లోను ఛాన్స్ పట్టేసింది. దీనికి తోడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ దర్శకనిర్మాతలు గ్యాలం వేసింది.

దీంతో ఎలాగోలా ఆమెకు బంపర్ ఆఫర్ దక్కింది. ఈ సారి ఏకంగా బాలీవుడ్ సినిమా ఛాన్స్ పట్టేసింది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో రొమాన్స్ చేసే అవకాశం దక్కించుకుంది షాలినీ. యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై 'జయేశ్‌భాయ్ జోర్దార్' అనే సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించనుండగా, ఆయన సరసన షాలినీ పాండే హీరోయిన్‌గా ఎంపికైంది.
దివ్యాంగ్ తక్కర్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తనకు ఈ అవకాశం రావడంపై షాలినీ తన ఆనందం వ్యక్తం చేసింది. రణ్‌వీర్ లాంటి గొప్ప నటుడితో కలిసి పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని ఆమె పేర్కొంది.


Click it and Unblock the Notifications











