Samantha Mad Love మీరంటే పిచ్చి ప్రేమ.. సమంత పోస్టుకు బాలీవుడ్ హీరో సిగ్నల్!
స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ బోల్డ్ ఫొటోషూట్స్‌తో, లవ్ అండ్ సింపతీ కొటేషన్స్‌తో మరింత క్రేజ్ పెంచుకుంటోంది. తాజాగా సోషల్ మీడియాలో మరో బోల్డ్ ఫొటోషూట్ పోస్ట్ అండ్ లవబుల్ క్యాప్షన్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. కాస్త క్లీవేజ్ షో కూడా చేసి హీట్ పెంచింది. పూర్తి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..
ఏం మాయ చేశావే చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైంది హీరోయిన్ సమంత. తొలి చిత్రంలోనే తన క్యూట్ యాక్టింగ్‌తో ఎంతో మంది కుర్రాళ్ల మదిని దోచిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. కేవలం తెలుగు చిత్రాలే కాదు తమిళంలోనూ నటించి మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే హీరో నాగచైతన్యను పెళ్లి చేసుకుంది. అయితే వీరి పెళ్లి మూడునాళ్ల ముచ్చటైంది.

అయితే డివొర్స్ తర్వాత కాస్త ఊపు బానే చూపించింది సమంత. కానీ ఏ హీరోయిన్ అయినా ఎంతో కాలం ఉండదన్న సంగతి తెలిసిందే. కొంతకాలానికి ఫేడౌట్ అవ్వాల్సిందే. సమంత పరిస్థితి విషయంలోనూ కొంత కాలం తర్వాత ఇదే జరిగింది. అదే సమయంలో మయోసైటిస్ రోగం బారిన పడంది. దీంతో వ్యాధి వల్ల తాను బాధపడిన క్షణాలను వివరిస్తూ తన సినీ కెరీర్‌ను నెట్టుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ వర్కౌట్ కాలేదు. సమంతా సింపతీతో అందర్నీ తనవైపునకు తిప్పుకుంటోందని భావించారు.

ఇదే సమయంలో పుష్ప చిత్రంలో ఊ అంటావా సాంగ్, ఫ్యామిలి మెన్ సీజన్ 2 మంచి హిట్ అయ్యాయి. దీంతో నేషనల్ వైడ్‌గా క్రేజ్ పెరిగి సమంత కమ్ బ్యాక్ అయింది. పైగా ట్రీట్మెంట్ కూడా తీసుకుంటూ రోగం బారిన నుంచి కాస్త బయటపడింది. మళ్లీ కెరీర్ పరంగా జోరు పెంచింది. వరుసగా దూసుకెళ్లే ప్రయత్నం చేసింది. మళ్లీ ఆమె సినిమాలు బోల్తా పడటం మొదలయ్యాయి. ఈ క్రమంలోనే చివరిగా ఖుషితో వచ్చి మోస్తరు హిట్ అందుకుంది.
మరోవైపు ఆమె రెండో పెళ్లి, ప్రేమ అంటూ చాలానే వార్తలు వచ్చాయి. కానీ వీటిని ఆమె కొట్టి పారేస్తూ వచ్చింది. అలానే ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ కూడా ఇచ్చింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం బోల్డ్ ఫొటోషూట్స్‌తో, క్లీవేజ్ షోలతో మంట పుట్టించింది. రీసెంట్గా ఈ రెండు మూడు రోజుల్లో అయితే ఓపెన్ షోలు బాగా చేసింది.

తాజాగా క్రీమ్ కలర్ సూట్ ధరించి జ్యూవెలరీ వేసుకొని క్లీవేషో చేసింది. పిచ్చి ప్రేమ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. దీంతో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా హాట్ ఎమోజీతో రిప్లై ఇచ్చారు. మరికొంతమంది లుకింగ్ లైక్ వావ్, అమేజింగ్, లేడీ బాస్ అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది సమంత మళ్లీ ప్రేమలో పడిందా అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. కాగా, వరుణ్ ధావన్ సమంత కలిసి నటించిన సిటాడెల్ ఇండియన్ వెబ్‌సిరీస్ త్వరలోనే రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











