Kalki 2 నుంచి దీపికా పదుకొణె ఔట్.. బాలీవుడ్ బ్యూటీపై నాగ్ అశ్విన్ సీరియస్?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తీసుకున్న నిర్ణయం మరో వివాదానికి దారి తీసింది. ఇప్పటికే దీపికా పదుకొణె ఇండియాస్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో వివాదానికి దిగిన సంగతి తెలిసిందే. స్పిరిట్ విషయంలో సందీప్ రెడ్డి వంగ వర్సెస్ దీపికా పదుకొణె గా మొన్నటి వరకు వార్ జరిగిన సంగతి మరిచిపోక ముందే తాజాగా మరో వార్త వినిపిస్తోంది. కల్కి 2 ప్రాజెక్ట్ నుంచి దీపికా పదుకొణె తప్పుకున్నట్టు తెలుస్తోంది. దీంతో దీపికాపై దర్శకుడు నాగ్ అశ్విన్ చాలా సీరియస్ గా ఉన్నారని, ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నారంటూ ఫిల్మ్ సర్కిల్ లో చర్చ సాగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

దీపికా పదుకొణె తెలుగు ప్రాజెక్ట్స్..
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెకు సౌత్ లోనూ మంచి క్రేజ్ ఉంది. ఆమె చిత్రాలు తెలుగులోనూ డబ్ అవుతుండటంతో ఇక్కడి ఆడియెన్స్ ను కూడా తన నటన, అందంతో కట్టి పడేసింది. అయితే దీపికా పదుకొణె తెలుగులో చేసిన మొట్ట మొదటి ప్రాజెక్ట్ 'కల్కి 2898 ఏడీ'. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంది. అదే Kalki 2. ఇదిలా ఉండగానే దీపికాకు డాషింగ్ డైరెక్టర్ నుంచి 'స్పిరిట్' చిత్రంలోనూ అవకాశం దక్కింది. ఇలా బిగ్ ప్రాజెక్ట్స్ తో మొన్నటి వరకు దీపికా పదుకొణె టాలీవుడ్ లో హాట్ టాపిక్ గ్గా మారింది.

Bollywood Heroine Deepika Padukone Walked Out from Prabhas Nag Ashwin Kalki 2

స్పిరిట్ మాదిరిగానే.. కల్కి 2తో దీపికా వివాదం..
దీపికా పదుకొణె సందీప్ రెడ్డి వంగ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. రెమ్యునరేషన్, పని వేళల రీత్యా స్పిరిట్ మూవీ నుంచి తప్పుకుంది. మరోవైపు సందీప్ రెడ్డి వంగ కూడా ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా దీపికాను తొలగించి, త్రిప్తి డిమ్రీని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అదే మాదిరిగా ఇప్పుడు కల్కి 2 ప్రాజెక్ట్ నుంచి కూడా దీపికా పదుకొణె తప్పుకుందని తెలుస్తోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ తోనూ రోజుకు 6 గంటలు మాత్రమే కల్కి 2కి పని చేస్తానని చెప్పిందంట. దీంతో నాగ్ అశ్విన్ సీరియస్ గా ఉన్నాడని తెలుస్తోంది. ఇక దీపికా పదుకొణెను ప్రాజెక్ట్ నుంచి తప్పించే పనిలో ఉన్నారని ఫిల్మ్ సర్కిల్ గట్టిగానే సౌండ్ వినిపిస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ వార్తలపై మున్ముందు టీమ్ ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.

కల్కి 2 షూటింగ్ ఎప్పుడు?
కల్కి 2898 ఏడీ చిత్రం 2024 జూన్ 27 విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి రూ.1100 కోట్లు వసూల్ అయ్యింది. ఇక ఈ చిత్రాన్ని పార్ట్ 2ను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్ ను ఈ ఏడాది 2025 ఫిబ్రవరిలోనే ప్రారంభించాలని అనుకున్నారు . కానీ కుదరలేదు. ప్రభాస్ బిజీ షెడ్యూల్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక 2025 డిసెంబర్ లో కల్కి 2 షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

ప్రభాస్ రాబోయే చిత్రాలు..
సలార్, కల్కి 2898 ఏడీ వంటి చిత్రాలతో చివరిగా ప్రభాస్ థియేటర్లలో దుమ్ములేపిన సంగతి తెలిసిందే. ఇక నెక్ట్స్ మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'రాజా సాబ్' చిత్రంతో అలరించబోతున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత ఫౌజీ చిత్రం రానుంది. ఇక ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ చిత్ర షూటింగ్ కు సిద్ధం అవుతున్నారు. అక్టోబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X