Janhvi kapoor: జాన్వీ కపూర్ అందాల జాతర - అంతలా చూపిస్తే అందరూ ఆగమే!
Janhvi kapoor: అలనాటి అందాల తార శ్రీదేవి, ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ల కూతురు, బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మ అందాన్ని మించకపోయినా మస్తు మస్తు అందాలను దాచుకుందీ ముద్దుగుమ్మ. ధడక్ సినిమాతో 2018లో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ హాట్ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది. ముఖ్యంగా ఘోస్ట్ స్టోరీస్, అంగ్రేజీ మీడియం, గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్, రూహి, గుడ్ లక్ జెర్రీ, మిలి, బావాల్, మిస్టర్ అండ్ మిస్సెస్ మహి సినిమాల్లో నటించి మెప్పించింది.
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ 30 సినిమాలో నటించేందుకు సిద్ధమైంది. ఈ సినిమాతోనే తాను తొలిసారిగా తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టబోతోంది. అలాగే ప్రస్తుతం ఈ క్యూట్ బ్యూటీ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. తన అందం, అభినయంతో అనేక అవకాశాలు అందిపుచ్చుకుంటూ...అందరి చేత ఆహా అనిపించుకుంటోంది. తన అద్భుతమైన అభినయాన్ని చూపించి లక్షలాది మంది సినీ అభిమానుల్ని అలరించింది.

ఎప్పుడూ సినిమాల్లో ఫుల్ బిజీగా గడిపే ఈ ముద్దుగుమ్మ నిజ జీవితంలోనూ అదిరిపోయే ఔట్ ఫిట్ లు వేసుకుంటూ నెట్టింటిని షేక్ చేస్తుంటుందీ. ముఖ్యంగా తనకు సంబంధించిన పర్సనల్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయానలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా జాన్వీ కపూర్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో అదిరిపోయే డ్రెస్సులో కనిపించి అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.

డార్క్ చాక్లెట్ కలర్ డ్రెస్సుల్లో ఈ ముద్దుగుమ్మ మెరిసిపోతుంది. బాడీ షేపులన్నీ బహుబాగా కనిపించేలా ఉన్న ఈ డ్రెస్సులో జాన్వీ కపూర్ నిజంగానే అదిరిపోయింది. చేతులు పైకెత్తి మరీ తన ఎద అందాలతో పాటు, మెడ, చేతుల అందాలను చూపిస్తోంది. బ్యాక్ అంతా ఓపెన్ గా ఉండే ఈ డ్రెస్సు వేసుకున్న జాన్వీ కపూర్ ఏదో పార్టీకి వెళ్లి ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా జాన్వీ కపూర్ అందాల ఆరబోతల్లో అస్సలే వెనకడుగు వేయదు.

అలాగే ఈ అమ్మడుకు ఉన్న క్రేజ్ కు టాలీవుడ్, బాలీవుడ్ లోనే కాకుండా మరిన్ని సినిమా అవకాశాలు కూడా వస్తాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తన తల్లిలాగే చాలా సినిమాల్లోనే ఛాన్సులు కొట్టేసి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటుందని భావిస్తున్నారు. మరి చూడాలి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











