43 ఏళ్ల వయసులో కరీనా స్టన్నింగ్ షో: కసి పెంచే ఫోజుతో హీటెక్కిస్తూ!
ఇప్పుడంటే ఇండియాలో ఎంతో మంది పాన్ ఇండియా రేంజ్ హీరోయిన్లు ఉన్నారు. కానీ, పదేళ్ల క్రితం మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే ఇలా ప్రభావాన్ని చూపించేవారు. అందులో అందాల భామ కరీనా కపూర్ ఒకరు. గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌తో సత్తా చాటుతోన్న ఈ సుందాంగి.. ఎన్నో సినిమాల్లో నటించి సందడి చేసింది. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం కరీనా కపూర్ సినిమా వేగాన్ని తగ్గించేసింది. అయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా అదిరిపోయే అందాల ఆరబోతతో ఫ్యాన్స్‌ను అలరిస్తూ.. తాజాగా ఓ పిక్ వదిలింది. దానిపై మీరే లుక్కేయండి మరి!
అలా వచ్చి స్టార్‌డమ్‌తో:హీరోయిన్‌గా పరిచయం అవకముందే కరీనా కపూర్ మోడల్‌గా సెన్సేషన్ అయింది. దీంతో ఎంతో మంది దర్శక నిర్మాతలు ఆమె కోసం పోటీ పడ్డారు. అప్పుడే 'రెఫూగీ' అనే సినిమాతో ఈ భామ బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా వచ్చింది. ఆ తర్వాత భారీ ఆఫర్లను దక్కించుకుని స్టార్‌గా ఎదిగింది. అప్పటి నుంచి కరీనా వరుసగా సినిమాలు చేసి ఎన్నో అవార్డులు, రికార్డులు అందుకుంది.

స్టార్ హీరో రెండో భార్య:పాన్ ఇండియా రేంజ్‌లో స్టార్‌గా సత్తా చాటుతోన్న కరీనా కపూర్.. సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్‌తో డేటింగ్ చేసింది. ఆ తర్వాత ఆయననే ఈ భామ పెళ్లి చేసుకుంది. అంత స్టార్‌డమ్ ఉన్న హీరోయిన్ ఒకరికి రెండో భార్యగా వెళ్లడం అనేది పెద్ద హాట్ టాపిక్ అయింది. దీనిపై కరీనా ఫ్యాన్స్ అప్పట్లో అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఇది పెద్ద సంచలనంగా మారిపోయింది.
బ్రేక్ లేకుండానే చేస్తూ:కరీనా కపూర్ వివాహం తర్వాత కూడా నటిగా ప్రయాణాన్ని కొనసాగించింది. ఇలా సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడూ.. తల్లైన తర్వాత కూడా కొన్ని వ్యాపార ప్రకటనల్లో నటించింది. అలాగే, కొన్ని బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ చేసింది. మొత్తంగా ఇద్దరు బిడ్డల తల్లైన తర్వాత కూడా కరీనా ఏమాత్రం ప్రభావాన్ని కోల్పోకుండా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతోంది.

ఇప్పుడు కూడా బిజీగా:రెండోసారి తల్లైన తర్వాత కెరీర్‌కు కాస్త బ్రేక్ ఇచ్చిన కరీనా కపూర్.. గత ఏడాది 'లాల్ సింగ్ చద్దా' అనే చిత్రంతో వచ్చింది. కానీ, ఇది ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక, ఇప్పుడు ఈ సీనియర్ హీరోయిన్ వరుసగా The Buckingham Murders, The Devotion of Suspect, The Crew, Singham Again వంటి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.
ఫ్యాన్స్‌తో ముచ్చట్లు:సుదీర్ఘ కాలంగా బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ సత్తా చాటినా.. ఇటీవలి కాలంలో సినిమాల్లో పెద్దగా సందడి చేయకున్నా.. బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తన వ్యక్తిగత విషయాలతో పాటు సినీ కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటోంది. తద్వారా ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.

హాట్ షోలో తగ్గట్లేదు:సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా హడావిడి చేస్తోన్న కరీనా కపూర్.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తరచుగా గ్లామరస్ ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. పెళ్లికి ముందు బోల్డుగా ఉన్న ఈ అమ్మడు.. ఇద్దరు బిడ్డల తల్లైనా కూడా ఏమాత్రం వెనుకాడట్లేదు. ఇలా కొంత కాలంగా కరీనా గ్లామర్ షోతో సెన్సేషన్‌గా మారిపోతుంది.
కరీనా బోల్డ్ పిక్ వైరల్:కరీనా కపూర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను వదిలింది. ఇందులో ఆమె టాప్‌ను కిందకు ధరించి మరీ ఘాటుగా ఫోజుచ్చింది. దీంతో ఈ పిక్‌లో ఆమె సీక్రెట్ అందాలు చూపరులకు ఓ రేంజ్‌లో కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా కరీనా కపూర్ షేర్ చేసిన ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇది వైరల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











