పెళ్లి తరువాత కూడా కరీనా రెమ్యునరేషన్ తగ్గలేదు.. 40లో కూడా అదే క్రేజ్!

సాధారణంగా హీరోయిన్స్ రెమ్యునరేషన్ యంగ్ ఏజ్ లో ఉండగానే ఎక్కువగా ఉంటుంది. వరుస విజయాలు అందితే 30లోకి వచ్చినా కూడా ఆదాయం ఏ మాత్రం తగ్గదు. ఇక కొంతమంది 40లో ఉన్నా కూడా ఒక మిడియమ్ హీరో రేంజ్ లో పారితోషికాన్ని అందుకుంటున్నారు. ప్రస్తుతం కరీనా కపూర్ కూడా అదే తరహాలో ఆదాయాన్ని పెంచుకుంటోంది. ఒక విధంగా కొన్ని సార్లు ఒక సంవత్సరంలో భర్త కంటే ఎక్కువగానే సంపదిస్తోంది.

ఎవరో ఒకరు పోటీకి వస్తూనే ఉన్నారు.

ఎవరో ఒకరు పోటీకి వస్తూనే ఉన్నారు.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ రేంజ్ ఎప్పటికప్పుడు మారిపోతోంది. ఎందుకంటే నిత్యం ఎవరో ఒకరు పోటీకి వస్తూనే ఉన్నారు. ఇక గత రెండు దశాబ్దాల కాలంగా కొంతమంది హీరోయిన్స్ ఇంకా అదే రేంజ్ లో ఉంటున్నారు అంటే వారు ఎలాంటి క్రేజ్ ని అందుకున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక అదే తరహాలో కరీనా కూడా తనదైన శైలిలో అవకాశాలు అందుకుంటోంది.

దాదాపు స్టార్ హిరోలందరితో

దాదాపు స్టార్ హిరోలందరితో

కరీనా మొదటిసారి 2000వ సంవత్సరంలో ముజే కుచ్ కెహ్నా హై సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అభిషేక్ బచ్చన్ హీరోగా నటించిన ఆ సినిమాతోనే కరీనా మంచి క్రేజ్ అందుకుంది. అయితే అప్పటి నుంచి కూడా కరీనా వెనుకడుగు వేసింది లేదు. దాదాపు స్టార్ హిరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది.

ఒక్కో సినిమాకు ఆరు కోట్లు

ఒక్కో సినిమాకు ఆరు కోట్లు

2012లో సైఫ్ అలీ ఖాన్ ని నివాహం చేసుకొని అనంతరం ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తరువాత కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కరీనా తన నటనతో జనాలను మరింతగా ఆకట్టుకుంది. ఇక అప్పుడప్పుడు యాడ్స్ ద్వారా కూడా బిజీగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఒక సినిమాకి అమ్మడు 6 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

రెండు పెద్ద సినిమాలు

రెండు పెద్ద సినిమాలు

కరీనా ప్రస్తుత వయసు 39 మరో రెండు నెలల్లో నాలుగు పదుల వయసుని అందుకోనుంది. ఇక ఆమె చేతిలో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి. అమీర్ ఖాన్ 'లాల్‌ సింగ్‌ చద్దా' సినిమాతో పాటు కరణ్‌ జోహర్‌ పీరియాడికల్‌ డ్రామా ‘తఖ్త్‌' చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది.

Recommended Video

Nepotism పై Renu Desai హాట్ కామెంట్స్‌!
భర్త కంటే ఆదాయం ఎక్కువే?

భర్త కంటే ఆదాయం ఎక్కువే?

సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లో ఆస్తులు గట్టిగానే ఉన్నప్పటికీ సినిమా ఇండస్ట్రీలో తన భార్య రేంజ్ లో మాత్రం ఆదాయాన్ని అందుకోవడం లేదు. కరీనా సినిమాలతో పాటు యాడ్స్ కూడా చేస్తోంది. ఇక సైఫ్ మాత్రం ఎన్ని సినిమాలు చేస్తున్నా కూడా గతంలో మాదిరిగా బాక్సాఫీస్ హిట్స్ అయితే అందుకోవడం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X