చిన్న వయసులోనే ఆ తప్పు చేశా.. అలాంటి రాత్రుల అనుభవం మర్చిపోలేను: స్టార్ హీరోయిన్
ఇప్పుడంటే దేశంలోని చాలా ఇండస్ట్రీల నుంచి పాన్ ఇండియా రేంజ్ హీరోయిన్లు ఉన్నారు. కానీ, కొన్నేళ్ల క్రితం మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే నేషనల్ రేంజ్ బ్యూటీలు హల్చల్ చేశారు. అలాంటి వారిలో కరీనా కపూర్ ఒకరు. చూపు తిప్పుకోకుండా చేసే అందం, మైమరపించే నటనతో మెప్పించిన ఈ భామ.. చాలా కాలం పాటు ప్రభావాన్ని చూపించింది. అయితే, ఈ మధ్య కాలంలో కాస్త స్లో అయింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కరీనా కపూర్ తన లైఫ్‌లో జరిగిన చేదు అనుభవాలను పంచుకుంది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి!
స్టార్ హీరోయిన్‌గా హవా:'రెఫూగీ' అనే సినిమాతో కరీనా కపూర్ బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంటరైంది. ఇందులో అందం, అభినయంతో మెప్పించడంతో ఆ తర్వాత భారీ ఆఫర్లను సొంతం చేసుకుంది. తద్వారా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది అప్పటి నుంచి కరీనా వరుసగా సినిమాలు చేసి ఎన్నో అవార్డులు, రికార్డులు అందుకుంది. ఇలా దాదాపు రెండు దశాబ్దాల పాటు పాన్ ఇండియాపై మార్క్ చూపింది.

హీరోకు రెండో భార్యగా:నేషనల్ వైడ్‌గా క్రేజ్‌ను పెంచుకుని సత్తా చాటుతోన్నప్పుడే కరీనా కపూర్.. సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్‌తో సీక్రెట్‌గా డేటింగ్ చేసింది. ఆ తర్వాత ఆయననే ఈ భామ పెళ్లి చేసుకుంది. అంత స్టార్‌డమ్ ఉన్న హీరోయిన్ ఒకరికి రెండో భార్యగా వెళ్లడం అనేది పెద్ద హాట్ టాపిక్ అయింది. దీనిపై కరీనా ఫ్యాన్స్ అప్పట్లో అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఇది హాట్ టాపిక్‌గా మారిపోయింది.
తల్లైనా బ్రేక్ లేకుండా:కరీనా కపూర్ పెళ్లి తర్వాత కూడా నటిగా ప్రయాణాన్ని కంటిన్యూ చేసింది. ఇలా సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడూ.. తల్లైన తర్వాత కూడా కొన్ని వ్యాపార ప్రకటనల్లోనూ నటించింది. అలాగే, కొన్ని బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. మొత్తంగా ఇద్దరు బిడ్డల తల్లైన తర్వాత కూడా కరీనా ఏమాత్రం ప్రభావాన్ని కోల్పోకుండా హవాను చూపించింది.

వరుస ప్రాజెక్టులతోనే:2022లో కరీనా కపూర్ 'లాల్ సింగ్ చద్దా' అనే చిత్రంతో వచ్చింది. కానీ, ఇది నిరాశనే మిగిల్చింది. గత ఏడాది ఆమె వరుసగా The Buckingham Murders, 'జానే జాన్' అనే సినిమాలతో వచ్చి ప్రేక్షకులను పలకరించింది. ఇప్పుడు కరీనా కపూర్ 'ది క్రూ', 'సింగం ఎగైన్' వంటి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. కొన్ని సిరీస్‌లకూ సైన్ చేసేసింది.
తప్పు చేశాను అంటూ:కరీనా నటించిన 'ది క్రూ' మూవీ విడుదల సందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో 'నా పాతిక సంవత్సరాల సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. నేను అప్పుడు ఎక్కువ పరాజయాలను చూశాను. నేను నా కెరీర్ లో పడ్డ ఇబ్బందులు మరెవ్వరు కూడా పడి ఉండరు. చిన్న వయసులో ఉండడం వల్లే ఈ తప్పులు జరిగాయి' అని చెప్పింది.

ఆ రాత్రులు దారుణం:కరీనా కంటిన్యూ చేస్తూ.. ''జబ్ వి మెట్' సినిమా కంటే ముందు నేను చేసిన ఎక్కువ మూవీలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఎందుకు నేను నటించిన సినిమాలు ఆడటం లేదు? అసలు ఎక్కడ సమస్య ఏర్పడింది? అనేది తెలియక ఏడుస్తూ ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను. ఇప్పటికీ అలాంటి అనుభవం ఎదురైన రాత్రులను తలచుకుంటే బాధేస్తుంది' అని వివరించింది.


Click it and Unblock the Notifications











