Shilpa Shetty: 48 ఏళ్ల వయసులోనూ సాగరకన్య అందాలు అదరహో... రోజు రోజుకూ హాట్‌నెస్ పెరుగుతుందిగా!

సాగరకన్య అనగానే మనకు గుర్తుకు వచ్చేది శిల్పా శెట్టి. ఈ భామ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇక వెంకటేష్ హీరోగా వచ్చిన సినిమా సాహసవీరుడు సాగరకన్య. ఈ సినిమాతోనే తెలుగులో ఆరంగేట్రం చేసింది. ఇక అప్పటి నుంచి ఈ భామను సాగరకన్య అంటూ అభిమానులు పిలుచుకుంటూ వస్తున్నారు. ఇక ఈ భామ 48ఏళ్ల వయసులోనూ అందాల ఆరబోత మామూలుగా లేదు. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పలు ఫోటోలను అభిమానుల కోసం పోస్ట్ చేసింది. వాటిపై మీరు ఓ లుక్ వేయండి.

శిల్పా శెట్టి... మంగుళురు భామ అయినప్పటికీ.. బాలీవుడ్ లో స్థిరపడింది. ఇక బాలీవుడ్ అయినప్పటికీ.. తెలుగులో తీసింది కొన్ని సినిమాలే అయినా... క్రేజ్ మాత్రం భలే కొట్టిసింది. వెంకటేష్ హీరోగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన సాహన వీరుడు సాగర కన్య చిత్రంతో ఈ భామ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ చిత్రంలో సాగర కన్యగా శిల్పా శెట్టి యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంది. నిజంగా సాగర కన్య ఉంటే.. అది శిల్పా శెట్టి లా ఉంటుందనే భావన కల్పించింది ఈ భామ.

Bollywood Heroine Shilpa Shetty Good Looking Saree Photoshoot Viral

ఇక ఆ తర్వాత కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన వీడెవడండీ బాబు సినిమాలో శిల్పా శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేకపోయింది. చివరగా నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా నటించిన 'భలే వాడివి బాసూ' సినిమాలో శిల్పా శెట్టి నటించింది. ఈ సినిమా అయితే బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇలా తెలుగులో మూడు సినిమాల్లో నటిస్తే... ఈ భామకు గుర్తింపు తెచ్చింది మాత్రం సాగర కన్య, సాహన వీరుడు చిత్రం మాత్రమే.

ఇక శిల్పాశెట్టి... నిజంగానే ఈమె శరీర సౌష్టవాన్ని ఎవరో శిల్పి చెక్కినట్లుగానే ఉంటుంది. ఇక ఈ భామ వయసు 48 ఏళ్లు అంటే ఎవ్వరూ నమ్మరు కావొచ్చు. అంతలా ఆమె బాడీ మెయిన్ టెయిన్ చేస్తూ.. ఉంటుంది. ఇక రోజు రోజుకూ శిల్పా శెట్టి వయసు తగ్గుతుందా అనే డౌట్ కలుగుతుంది. ఇప్పటికీ యోగాలసనాలతో అభిమానులకు ట్రీట్ ఇస్తూనే... ఆమె అందాలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇక ఈమె ఫోటోలను చూసిన నెటిజన్లు అయితే.. వయసు పెరిగిన కొద్ది అందం పెరుగుతుందని కామెంట్స్ చేస్తూ ఉంటారు.

Shilpa Shetty Latest Photos

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ... తన అందచందాలతో నెటిజన్లను ఆకర్షించే పనిలో ఉంటుంది. తాజాగా ఎల్లో కలర్ శారీలో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ భామ. ఇక ఈ ఫోటోల్లో ఆమె నడుము అందాలు చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. 48 ఏళ్ల వయసు వచ్చినా... అస్సలు తరగని అందాలు ఏంటి బాబోయ్... అన్నట్లు ఉన్నాయి. ఇవి చూసిన నెటిజన్స్... కామెంట్ల వర్షం కురిపిస్తూ... ఫోటోస్ ను వైరల్ చేస్తున్నారు.

Shilpa Shetty Latest Pics Trending In social media

ఇక శిల్పాశెట్టి సినిమాల విషయానికి వస్తే... తాజాగా ఈ భామ సుఖీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా పర్వాలేదనిపించింది. ఇక పలు వెబ్ సిరీస్, టీవీ షోల్లో కూడా ఈ భామ సందడి చేస్తోంది. ఇక శిల్పా శెట్టి చేతిలో పలు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X