18 లక్షల బ్యాగుతో ఆశ్చర్యపరుస్తున్న సోనమ్ కపూర్!
బాలీవుడ్ తారలు అనుభవించే లగ్జరీ లైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రెండుకు తగ్గట్లుగా స్టైల్ గా కనిపించడం కోసం బాలీవుడ్ తారలు ఖర్చుకు వెనకాడరు. తాజాగా సోనమ్ కపూర్ అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. గత ఏడాది సోనమ్ కపూర్ తన ప్రియుడు ఆనంద్ ని వివాహం చేసుకున్న సంగతి తెలుసిందే. చాలా కాలంగా సహజీవనంలో ఉన్న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
సోనమ్, ఆనంద్ ఇటీవల పలు సందర్భంలో అన్యోన్యంగా కనిపిస్తూ తమ మధ్య ప్రేమని చాటుకుంటున్నారు. ఇదిలా ఉండగా సోనమ్ కపూర్ ఇటీవల అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించి అందరగొట్టింది. గ్రే కలర్ డ్రెస్ ధరించిన సోనమ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆమె చేతిలో ఉన్న బ్యాగు గురించి అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. సోనమ్ కపూర్ చేతులో ఉన్న బ్యాగు ధర అక్షరాలా 18 లక్షలు.

హెర్మన్ బిర్కిన్ బ్రాండ్ కు చెందిన ఈ బ్యాగులు ధరలు అత్యంత ఖరీదైనవిగా ఉంటాయి. వివాహం తర్వాత కూడా సోనమ్ కపూర్ సినిమాలు కొనసాగిస్తోంది. ప్రస్తుతం సోనమ్ కపూర్ దుల్కర్ సల్మాన్ సరసన ది జోయా ఫ్యాక్టర్ అనే చిత్రంలో నటిస్తోంది. అభిషేక్ శర్మ ఈ చిత్రానికి దర్శకుడు. గత ఏడాది సోనమ్ కపూర్ సంజు, వీర్ దే వెడ్డింగ్ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది.


Click it and Unblock the Notifications











