పడక గదిలోకి వస్తావా? ఆఫర్ ఇస్తా.. తెలుగు నిర్మాత కోరికను హీరోయిన్ బట్టబయలు!
సినిమా ఇండస్ట్రీలో ఆఫర్ కోసం పడక గదికి వెళ్లే సంస్కృతికి కొందరు బలైపోతుంటారు. కొందరు అలాంటి వాటికి దిగజారకుండా తప్పించుకొంటారు. అలాంటి సంఘటన తెలుగు సినిమా పరిశ్రమలో తనకు ఎదురైందని బాలీవుడ్ నటి సుచిత్ర పిళ్లై ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించారు. దాంపత్య జీవితంలో స్థిరపడిన ఆమె ఇటీవల ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో తెలుగు డైరెక్టర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె వెల్లడించిన సంచలన వివరాల్లోకి వెళితే..
సుచిత్రా పిళ్లై విషయానికి వస్తే.. పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆమె ఫ్రెంచ్ సినిమాతో యాక్టింగ్ కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత ఇంగ్లీష్, అనంతరం హిందీ సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. బస్ ఇత్నా సా క్వాబ్ హై అనే చిత్రంలో నటించడం ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచమయమైంది. ఆ తర్వాత దిల్ చాహ్తా హై సినిమాలో సైఫ్ ఆలీ ఖాన్ గర్ల్‌ఫ్రెండ్‌గా నటించి గుర్తింపు తెచ్చుకొన్నది.

దిల్ చాహ్త హై సినిమాలో గుర్తింపు వచ్చిన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఆఫర్ వచ్చింది. ఓ మధ్యవర్తి నాకు కాల్ చేసి ఆఫర్ గురించి చెప్పారు. హీరోకు సోదరి పాత్రలో నటించాలని చెప్పారు. అయితే ఆ నిర్మాత గురించి చెబుతూ.. ఆయనకు ఇది తొలి చిత్రం అని నా దగ్గర ప్రస్తావించారు. దాంతో నా రెమ్యునరేషన్‌లో డిస్కౌంట్ అడుగుతున్నారేమో అనుకొనే సరే అందామని ఫిక్స్ అయ్యాను అని తెలిపింది.
అయితే క్యాస్టింగ్ మేనేజర్ నాతో ఓపెన్ అయి.. ఆయన ఫస్ట్ టైమ్ ప్రొడ్యూసర్. ఆయన కోసం మీరు కాంప్రమైజ్ కావాలి. ఆఫర్ ఇస్తారు.. కానీ పడక గదిలో ఆయన కోరిక తీర్చాల్సి ఉంటుంది అని నసిగాడు. దాంతో నాకు కోపం తీవ్ర స్థాయిలో పెరిగింది. ఇలాంటి విషయాలు నా వద్దకు తీసుకు రాకండి అంటూ గట్టిగా మందలించి ఆ సినిమా నుంచి తప్పుకొన్నాను అని చెప్పారు.

ఇండస్ట్రీలో కొందరు తప్పుడు మనుషులు.. అందర్నీ తప్పుగా అంచనా వేస్తారు. ఆఫర్ కోసం ఏదైనా చేస్తారనుకొని అందర్నీ ఒకే విధంగా అంచనా వేస్తారు. కానీ నా వద్దకు వచ్చిన వ్యక్తి రాంగ్ నంబర్‌ను డయల్ చేశారనే విషయాన్ని ఆయనకు అర్ధమయ్యేలా చెప్పాను అని సుచిత్ర పిళ్లై అన్నారు.


Click it and Unblock the Notifications











