Photos 52 ఏళ్ల వయసులో గ్లామర్‌తో టబు కనికట్టు.. లేటు వయసులో కూడా ఇంత హాట్‌గానా?

ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఫిమేల్ లిస్ట్ లో మొదటి పేరు అంటే హీరోయిన్ టబు పేరే వినిపిస్తుంది. టబు అసలు పేరు తబస్సుమ్ ఫాతిమా హష్మి. బాలీవుడ్ నటి ఫరాహ్ చెల్లెలిగా ఆమె ఇండస్ట్రీకి పరిచయమయ్యింది.

తెలుగులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ నెం 1 చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే అమ్మడు భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమా తరువాత తెలుగులో వరుస అవకాశాలను అందుకున్న టబు.. నిన్నే పెళ్ళాడతా అనే సినిమాలో నాగ్ సరసన నటించి మెప్పించింది.

Bollywood heroine tabu raises the heat in her latest photoshoot photos viral in social media

మొదట ఈ పాత్ర మీనా వద్దకు వెళ్ళగా ఆమె వేరే సినిమాలో బిజీగా ఉండడంతో పండు పాత్ర టబు ను వరించింది. టబు కెరీర్ లోనే ది బెస్ట్ సినిమాగా నిన్నే పెళ్ళాడతా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ సినిమా నుంచి నాగ్ తో టబు కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారిందని, వీరిద్దరి మధ్య ఒక రిలేషన్ ఉందని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అంతే కాదు నాగ్ వలనే టబు ఇంకా పెళ్లి చేసుకోలేదని కూడా టాక్ నడుస్తోంది.

తెలుగులో నాగ్, హిందీ లో అజయ్ దేవగణ్, బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలాతోనూ బంధం ఉందని అంటుంటారు. అయితే టబు మాత్రం.. నా బాయ్ ఫ్రెండ్స్ అంటూ చాలామంది పేర్లు బయటికి వచ్చాయి. బాయ్ ఫ్రెండ్స్ ఎంతమంది అయినా రావొచ్చు పోవచ్చు అంటూ చెప్పి అందరి నోర్లు మూయించింది. అంతేనా ఏజ్ అవుతుంది.. పిల్లలకు ఇబ్బంది అవుతుంది.. పెళ్లి చేసుకోండి అన్నవారిపై కూడా ఆమె విరుచుకుపడింది.

Bollywood heroine tabu raises the heat in her latest photoshoot photos viral in social media

పెళ్లికి, పిల్లలకు సంబంధం ఏం ఉంది. పిల్లలు కావాలంటే పెళ్లె చేసుకోవాలా అని అడిగి షాక్ ఇచ్చింది. దీంతో మరోసారి ఆమె దగ్గర పెళ్లి ప్రస్తావన ఎత్తే ధైర్యం ఎవరు చేయలేదు. టబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ అనే తేడా లేకుండా మంచి కథలను ఎంచుకొని ఇంకా స్టార్ గా కొనసాగుతోంది.

తెలుగులో చాలా కాలం తర్వాత 2020 లో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురం లో సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఇక ఈ మధ్యనే క్రూ అనే సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోత మరో ఎత్తు అని చెప్పాలి.

52 ఏళ్ల వయసులో కూడా అంతే అందాన్ని మెయింటెయిన్ చేస్తూ టబు అదరగొడుతోంది. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా టబు లేటెస్ట్ ఫోటోషూట్ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది. బ్లాక్ డిజైనర్ డ్రెస్ లో ఒకటి..రెడ్ కలర్ డిజైనర్ డ్రెస్ లో ఒక ఫోటోను టబు షేర్ చేసింది. రెండు ఫోటోలలో టబు తన అందంతో మేస్మరైజ్ చేసింది.

ఇక ఈ వయస్సులో కూడా ఆమె ఇంత అందాన్ని మెయింటెయిన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కుర్ర హీరోయిన్లకు సైతం కుళ్ళు పుట్టేలా అమ్మడి అందం ఉందని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X