Item song: ఐటమ్ సాంగ్‌ కు బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ గ్రీన్ సిగ్నల్. కానీ..

Item song: ఒకప్పుడు ఐటమ్ సాంగ్ లో స్టెప్పులేయడానికి ప్రత్యేకంగా నటీమణలు ఉండేవారు. వాళ్లను ఐటమ్ క్వీన్ , ఐటమ్ బ్యూటీస్ అనేవాళ్లు. కానీ రాను రాను కాలం మారినట్టే.. ఐటమ్ సాంగ్ లో స్టెప్పులేసే భామలు కూడా మారిపోయారు. ప్రసెంజ్ హాట్ సాంగ్ పై సెప్పులేయడానికి స్టార్ హీరోయిన్స్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఒక్కొక్క ఐటెమ్ సాంగ్ కు కోట్లల్లో డిమాండ్ చేస్తున్నారు. వెనకడుగు వేయకుండా స్పెషల్ సాంగ్స్ లో హాట్ హాట్ స్పెపులేస్తున్నారు. ఈ క్రమంలో ఓ బాలీవుడ్ బ్యూటీ స్పెషల్ సాంగ్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, కొన్ని కండీషన్స్ పెట్టిందంట. ఇంతకీ ఆ బాలీవుడ్ బ్యూటీ ఎవరు? ఆమె అమ్మడు పెట్టిన షరతులేంటో ? మీరు కూడా ఓ లూక్కేయండి.

ఐటెం సాంగ్స్ లో సెప్పులేయడానికి బాలీవుడ్ బ్యూటీలు కరీనా కపూర్, కత్రినా కైఫ్ లాంటి హీరోయిన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దీంతో ఐటెం బ్యూటీగా
చక్రం తిప్పిన మలైకా అరోరా లాంటి హీరోయిన్లకు డిమాండ్ తగ్గిపోయింది. వాస్తవానికి ఈ ట్రెండ్ సెట్ చేసింది టాలీవుడ్ బ్యూటీ శ్రియ‌ సరన్. వరస సినిమా అవకాశాలు వస్తున్నప్పుడే ఈ అమ్మడు ఐటమ్ సాంగ్స్ వైపు అడుగులు వేసింది. ఆ సమయంలో శ్రియ తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేమింటంటే.. ఈ ఒక్క సాంగ్ చేస్తేనే కోట్లలో రెమ్యూనరేషన్ రావడంతో ఈ సాంగ్ చేయడానికి ఆత్రుతపడుతున్నారు స్టార్ హీరోయిన్స్.

Bollywood hot beauty Ananya Pandey has given the green signal to act in Item song she reveals her conditions for the same

ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే (Ananya Pandey) కూడా ఐటెం సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేకు స్పెషల్ సాంగ్ లో నటించడం ఎలాంటి అభ్యంతరం లేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కానీ ఈమెకు పలు కండిషన్స్ ఉన్నాయని తెలిపింది. పాటలో మితిమీరిపోయి అతిగా అందాలు ప్రదర్శించడం తనకు నచ్చదని వెల్లడించింది. అలాగే ఈ బ్యూటీ స్టెప్పులేయబోయే సాంగ్ లో తన పాత్రకు గౌరవం ఇవ్వాలని పేర్కొంది. ఏ ఐటెమ్ సాంగ్‌లో అయినా అమ్మాయిని చూపించే విధానంలో ఎన్నో పద్ధతులు ఉంటాయని.. చాలా ఏళ్ల నుంచి ఫాల్లో అవుతోన్న పద్ధతినే ఇప్పుడు అనుసరించాల్సిన అక్కర్లేదు అని తెలిపింది.

సాంగ్ లో అమ్మాయిని అందంగా చూపించాలనుకోవడంలో ఏమాత్రం తప్పులేదు కానీ ఒక బొమ్మలాగా అస్సలు చిత్రీకరించవద్దని వివరించింది. ఈ అమ్మడు డైరెక్టర్లకు పెట్టిన నిబంధనలకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరీ త్వరలో అనన్య పాండే ఏ మూవీలోని స్పెషల్ సాంగ్‌లో మెరవనుందో చూడాలి. ఈ అమ్మడు కండీషన్స్ కు మాత్రం అభిమానులు గౌరవం ఇస్తున్నారు. స్పెషల్ సాంగ్స్ లో అనన్యకు అవకాశాలు రావాలని గట్టిగా కోరుకుంటున్నారు.

Bollywood hot beauty Ananya Pandey has given the green signal to act in Item song she reveals her conditions for the same

ఇక ఈ బ్యూటీ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన లైగర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆడలేదు కానీ అనన్య నటనకు ప్రశంసలు దక్కాయి. స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2, ఖాలీపీలీ, పతి పత్నీ ఔర్‌ వో, ఆంగ్రేజి మీడియం, శకున్ బత్రా వంటి హిందీ చిత్రాల్లో నటించి తన నటన, అందం, అభినయంతో జనాల్ని ఆకట్టుకుంది. అటు బాలీవుడ్ చిత్రాలు, హాట్ వెబ్ సీరిస్ లతో ఈ అమ్మడు బిజీగా గడుపుతోంది. అలాగే.. నిత్యం తన హాట్ ఫోటో షూట్ ను నెట్టింట్లో షేర్ చేస్తూ.. కుర్రాకారుకు చెమటలు పట్టిస్తోంది.

More from Filmibeat

Read more about: ananya panday bollywood item song
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X