లేటు వయసు ఘాటు అందాలు.. 48 ఏళ్ల వెంకీ మామ బ్యూటీని గుర్తు పట్టారా?
బాలీవుడ్ హాట్ బ్యూటీ శిల్పా శెట్టి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందంతో కుర్రకారును ఉర్రూతలూగించిన ఈమెకు.. ఇప్పటికీ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. 1993లో బాజీగర్ అనే సినిమాతో బాలీవుడ్ సినీ రంగంలో అడుగు పెట్టిన ఈమెకు మొదటి సినిమాతోనే ఫిల్ం ఫేర్ ఉత్తమ సహాయ నటిగా నామినేట్ అయింది. ఆ తర్వాత ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. తన అందం, అభియనంతో విపరీతమైన క్రేజ్ సంపాధించుకుంది.
1996లో సాహసవీరుడు సాగర కన్య సినిమాతో తెలుగు సినీ రంగంలోనూ కాలు మోపింది. ఆ తర్వాత వీడెవడండీ బాబూ, ఆజాద్, భలేవాడివి బాసూ సినిమాలోనూ చేసింది. చేసింది మూడు సినిమాలే అయినా తెలుగులోనూ అనేక మంది అభిమానుల్ని సొంతం చేసుకుందీ ముద్దుగుమ్మ. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ అనేక చిత్రాలు చేసింది. అయితే 2009లో ప్రముఖ వ్యాపార వేత్త రాజ్ కుంద్రాను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత పిల్లలు పుట్టడంతో మధ్య మధ్యలో బ్రేకులు తీసుకుంది. కానీ హీరోయిన్ గా కొనసాగుతూనే వస్తోంది.

ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు అభిమానులకు అందుబాటులో ఉంటోంది. సోషల్ మీడియా వేధికగా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్ డేట్లను పంచుకుంటూ అందరికీ అందుబాటులో ఉంటోంది. ముఖ్యంగా లేటెస్ట్ ట్రెండీ వేర్ లు ధరిస్తూ నెట్టింట ఫుల్ రచ్చ చేస్తుంది. పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను కూడా చెబుతుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేధికగా తన అందమైన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది.
అందులో బ్లాక్ కలర్ టైట్ డ్రెస్ వేసుకుని యమా హాట్ గా ఫొటోలు దిగింది. ఈ ఫొటోలు చూస్తే ఎవ్వరైనా సరే శిల్పా శెట్టి అందాలకు ఫిదా అవ్వాల్సిందే. 48 ఏళ్ల వయసు కల్గిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ ఇంత ఫిట్ గా ఉందంటే ఆమె తన అందానికి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. చిన్న చిన్న మిడ్డీల నుంచి చీరల వరకు అన్నీ వేసుకుంటూ అన్ని రకాల ఫోజులు పెడుతూ.. కుర్రకారు గుండెల్లో హీటు పుట్టించే ఈ ముద్దుగుమ్మను చాలా మందే ఫాలో అవుతున్నారు. తాజాగా ఈమె షేర్ చేసిన ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

అందంగా ఉన్నావు, అదిరిపోయావు, చాలా హాట్ గా కనిపిస్తున్నావు, హాట్ నెస్ ఓవర్ లోడెడ్, ట్రెండీ ఔట్ ఫిట్ లో నీ అందాలు మరింత పెరిగిపోయాయి అంటూ నెటిజెన్లు తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మీరూ ఓసారి ఈ ముద్దుగుమ్మ ఫొటోలు చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











