16 ఏళ్లకు పెళ్లి, 17 ఏళ్లకు కవలలు, 18 ఏళ్లకు విడాకులు.. 45 ఏళ్ల వయసులో మరింత హాట్‌గా సినిమాల్లో.. ఈ హీరోయిన్

బాలీవుడ్ హాట్ బ్యూటీ... ఊర్వశి ఢోలకియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆరేళ్ల ప్రాయంలోనే నటి రేవతితో కలిసి లక్స్ సోప్ టీవీ వాణిజ్య ప్రకటనలో నటించి మెప్పించింది. అలాగే దూరదర్శన్ టీవీ సిరీస్ శ్రీకాంత్‌ లో రాజలక్ష్మిగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత దూరదర్శన్ దేఖ్ భాయ్ దేఖ్‌లో శిల్పా పాత్రలో అడల్ట్ పాత్రలో కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసింది. తర్వాత వక్త్ కి రాఫ్తార్ లో కూడా నటించింది. 1986లో బాబుల్ అనే సినిమా చేసి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. ఇదొక్కటే కాకుండా కబ్ తక్ చుప్ రహంగీ, ఇజ్జత్, స్వప్నం అనే చిత్రాల్లోనూ నటించింది.

ముఖ్యంగా 2001లో... కసౌటి జిందగీ కే, కహిన్ తో హోగా అనే టీవీ సిరీస్ లో నటించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఏక్తా కపూర్ ఘర్ ఏక్ మందిర్, కభీ సౌతాన్ కబీ, సహేలి వంటి షోలు చేసి మరింత క్రేజ్ దక్కించుకుంది. టీవీతో పాటు సినిమాల్లో సూపర్ క్రేజ్ సాధించిన ఈమెకు అనేక అవార్డుకు కూడా వచ్చాయి. ముఖ్యంగా 2000ల దశాబ్దంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల జాబితాలోకి కూడా చేరిందీ ముద్దుగుమ్మ. 2012లో కలర్స్ టీవీ బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొని.. విన్నర్ గా నిలిచింది.

Bollywood Hot Beauty Urvashi Dholakia Personal Life Problems Check Details

1978లో పుట్టిన ఈ ముద్దుగుమ్మ 1994 అంటే 16 ఏళ్ల వయసులోనే ఈమె వివాహం చేసుకుంది. ఇక ఆ తర్వాత ఏడాదే ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఏడాది అంటే 18 ఏళ్ల వయసులో భర్త వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఒంటరిగా ఉంటూనే తన పిల్లలు క్షితిజ్, సాగర్ లను పెంచుకుంటోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తన జీవితం గురించి అనేక విషయాలు చెప్పింది. తన పర్సనల్ లైఫ్ గురించి తొలిసారి చెప్పుకొచ్చింది. మహారాణిలా బతకాలి అనుకున్న తన జీవితం ఎటూ కాకుండా పోయిందని అన్నారు.

Bollywood Hot Beauty Urvashi Dholakia Personal Life Problems Check Details

ముఖ్యంగా అంత చిన్న వయసులో పెళ్లి చేసుకున్న ఆమెకు త్వరగా పిల్లలు పుట్టడం.. భర్త సరిగ్గా ఉండకపోవడం దారుణం అని తెలిపింది. అతడు పిల్లలను సరిగ్గా చూడకపోవడం వల్లే విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని... తన తల్లిదండ్రుల సపోర్ట్ తోనే పిల్లల బాధ్యత చక్కగా నిర్వర్తించ గల్గినట్లు స్పష్టం చేసింది. భర్తతో విడిపోయాక చిత్ర రంగంలోకి రావాలనుకుంటే చాలా మంది అడ్వాంటేజ్ తీసుకోవాలనుకున్నారని.. సింగిల్ పేరెంట్ గా చాలా ఇబ్బందులు పడ్డానని స్పష్టం చేసిందీ ముద్దుగుమ్మ. కానీ అవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ 45 ఏళ్ల వయసులోనూ సినిమాల్లో రాణిస్తున్నానని చాలా సంతోషంగా చెప్పింది. తన పిల్లలే తన బలం, బలహీనత అంటూ వివరించింది. తన కొడుకులు ఎప్పుడూ తనతోనే ఉంటూ అండగా నిలబడ్డారని స్పష్టం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X