30 ఏళ్ల రూల్ బ్రేక్ చేసిన స్టార్ హీరోయిన్.. ఆ సీన్స్ పై షాకింగ్ కామెంట్స్!

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ (Kajol) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు మూడు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు తన నటనతో, న్యాచులర్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కొంత కాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన రీ ఎంట్రీ లో ఓవైపు వరుసగా సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. అంతే కాకుండా 51 ఏళ్ల వయసులోనూ కత్తిలాంటి అందాలను మెయింటేన్ చేస్తోంది. బోల్డ్ సినిమాల్లోనూ నటిస్తూ అందరికీ షాక్ ఇస్తోంది. కెరీర్ ప్రారంభంలో ఈ ముద్దుగుమ్మ కొన్ని వ్యక్తిగత నియమాలను పెట్టుకున్న.. తాజాగా ఓ ఓటీటీ ప్రాజెక్ట్ కోసం తన మూడు దశాబ్దాల రూల్స్ ను బ్రేక్ చేసిందట. ఇంతకీ ఆ నిబంధనేంటీ?

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ కాజోల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 90లలో సహజ నటన, స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె.. కెరీర్ మొత్తం కొన్ని వ్యక్తిగత హద్దులను కచ్చితంగా పాటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తెరపై కిస్సింగ్ సీన్స్, ఇంటిమేట్ సన్నివేశాలకు దూరంగా ఉండటం ఆమె ప్రత్యేకతగా మారింది. అయితే 30 ఏళ్ల కెరీర్ తర్వాత తొలిసారి తనే ఆ రూల్ బ్రేక్ చేసి ఓటిటి ప్రాజెక్ట్ కోసం ఆన్‌స్క్రీన్ కిస్ చేయడం చర్చకు దారి తీసింది. తాజాగా ఈ విషయంపై కాజోల్ నోరువిప్పింది.

Bollywood Kajol Breaks 30-Year No Kiss Rule for OTT Debut Reveals Real Reason Behind Bold Scene

1992లో బెఖుడి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కాజోల్.. కొద్ది కాలంలోనే బాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. ముఖ్యంగా షారూఖ్ ఖాన్‌తో ఆమె జోడీ ఇండస్ట్రీలో హిట్ ఫేయిర్. దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే, కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ ఘమ్, మై నేమ్ ఈజ్ ఖాన్ వంటి సినిమాలు ఆమె కెరీర్‌కు మైలురాళ్లుగా నిలిచాయి. ఇంత సుదీర్ఘ ప్రయాణంలో గ్లామర్‌కు కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతో ముందుకు సాగిన అరుదైన స్టార్‌గా కాజోల్ గుర్తింపు పొందారు.

ఇలాంటి కాజోల్ 2023లో ది ట్రయల్: ప్యార్, కానూన్, ధోఖా ద్వారా ఓటిటి ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ అమెరికన్ సిరీస్ ది గుడ్ వైఫ్ కు అనువాదంలో రూపొందించబడిన ఈ సిరీస్‌లో కాజోల్ నోయోనికా సేన్‌గుప్తా అనే గృహిణి పాత్రలో కనిపించారు. భర్త అవినీతి కేసులో అరెస్టవడంతో తిరిగి లాయర్‌గా కెరీర్ ప్రారంభించిన మహిళ కథగా దీన్ని రూపొందించారు. ఈ కథలలో భావోద్వేగాలు, కుటుంబ విరోధాలు, వ్యక్తిగత సంఘర్షణలు ప్రధాన అంశాలుగా నిలిచాయి.

ఈ సిరీస్‌లో నటుడు జిషు సేన్‌గుప్తా ఆమె భర్త పాత్రలో నటించారు. కథలో భాగంగా వీరిద్దరి మధ్య ఒక కిస్సింగ్ సీన్ ఉండగా, అదే కాజోల్ కెరీర్‌లో తొలి ఆన్‌స్క్రీన్ కిస్‌గా నిలిచింది. కెరీర్ మొత్తం నో-కిస్ పాలసీ పాటించిన నటి ఇలాంటి సన్నివేశంలో నటించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియాలో కూడా ఇది హాట్ టాపిక్‌గా మారింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాజోల్ ఈ సీన్ వెనుక ఉన్న కారణాన్ని వివరించారు. ఆ సన్నివేశాన్ని కేవలం ముద్దు సీన్‌గా చూడకూడదని స్పష్టం చేశారు. కథలో ఆమె పోషించిన పాత్ర భావోద్వేగాలు, మనస్తత్వం, ఆలోచనలు, నమ్మకాలు అన్నీ ఆ క్షణంలో ప్రతిబింబిస్తాయని తెలిపారు. "ఆ సీన్ తీసేస్తే పాత్రలోని ఒక ముఖ్యమైన భావన మిస్సవుతుంది" అంటూ వివరించారు.అయితే ఆ సన్నివేశం షూటింగ్ సమయంలో తాను పూర్తిగా కంఫర్ట్‌గా లేనని కాజోల్ చెప్పారు.

మొదట్లో కొంత అసౌకర్యంగా అనిపించిందని, చివరి వరకు సందేహంగానే ఉన్నప్పటికీ నటిగా బాధ్యతగా భావించి పూర్తి చేశానని తెలిపారు. అదే సమయంలో, ఈ నిర్ణయం తన వ్యక్తిగత అభిప్రాయాలు మారినందుకా కాదు అని ఆమె స్పష్టం చేశారు. పాత్రకు అవసరం ఉండటం, కథకు ప్రాధాన్యం ఉండటంతోనే ప్రొఫెషనల్‌గా ఆ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తన కెరీర్ మొత్తం ఎప్పుడూ తన నిర్ణయాల విషయంలో నిజాయితీగా ఉంటానని కూడా కాజోల్ పేర్కొన్నారు.

Read more about: bollywood kajol
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X