మరో హిస్టారికల్ బయోపిక్.. డైరెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్న కాంట్రవర్సీ క్వీన్
బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో హిస్టారికల్ బయోపిక్ కు రంగం సిద్ధమవుతోంది. కంగనా మరో మణికర్ణితో సిద్ధం కానున్నట్లు క్లారిటీ వచ్చేసింది. కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ అందరి దృష్టిని ఆకర్షించేలా కథలను ఎంచుకుంటుందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లో కూడా అమ్మడు మెల్లగా తన క్రేజ్ ను పెంచుకుంటోంది. అందరిచూపు ఇప్పుడు తలైవి పైనే ఉంది.
ఆ సినిమా దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. AL విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే కంగనా రనౌత్ మరో హిస్టారికల్ కథను టచ్ చేయబోతున్నట్లు సమాచారం. 980కాలం నాటి కాశ్మీర్ మహారాణి దిడ్డా జీవిత ఆధారంగా మణికర్ణిక రిటర్న్స్: ద లెజెండ్ ఆఫ్ దిడ్డా అనే సినిమాని తెరకెక్కించనున్నారట.

మరోక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ సినిమాను కంగనా స్వీయ దర్శకత్వంలో రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు మణికర్ణిక: ద క్విన్ ఆఫ్ ఝాన్సీ సినిమాకు చివరి ఎపిసోడ్స్ ను ఆమె డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు మొదట టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించినప్పటికి కొన్ని మనస్పర్థల కారణంగా తప్పుకున్నాడు. ఇక ఇప్పుడు పూర్తి స్థాయిలో బిగ్ బడ్జెట్ సినిమాను డైరెక్ట్ చేయనున్న కంగనా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











