ముక్కు నుంచి ఆ పార్ట్ వరకు.. గ్లామర్ కోసం 29 సర్జరీలు, ఎవరా హీరోయిన్?

ఇటీవలి కాలంలో అందంపై అందరికీ స్పృహ పెరిగింది. ఒక్క వెంట్రుక రాలినా, అక్కడక్కడా తెల్ల వెంట్రుకలు కనిపించినా ప్రాణం పోయినంత పని అవుతుంది జనానికి. ఆహారంతో పాటు వ్యాయామం, యోగాలతో తమ అందాన్ని కాపాడుకుంటున్నారు. అవసరమైతే కాస్మోటిక్ సర్జరీల వరకు వెళ్తున్నారు. సామాన్యుల పరిస్ధితే ఇలా ఉంటే గ్లామర్ ప్రపంచంలో జీవించే సినీతారల పరిస్ధితి ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందం ఉన్నంత కాలమే వారి కెరీర్.. మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా ఉంటుంది. ఇందుకోసం ఏం చేయడానికైనా వెనుకాడరు. అలా తన గ్లామర్ కోసం, జీవితాంతం అందాన్ని కాపాడుకునేందుకు గాను ఓ హీరోయిన్ ఏకంగా 29 సర్జరీలు చేయించుకున్నారట. ఈ వివరాల్లోకి వెళితే..

అతిలోకసుందరిగా స్టార్‌డమ్
అందానికే పర్యాయపదంగా మారి, అతిలోకసుందరిగా అభిమానుల చేత జేజేలు అందుకున్నారు శ్రీదేవి. 70, 80 దశకాల్లో భారతీయ చిత్ర పరిశ్రమను ఏలారు. బాలీవుడ్‌లో ఫిమేల్ సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుని ఇండస్ట్రీని శాసించారు. నటిగా ఎదగడానికి శ్రీదేవి ఎంతో కష్టపడ్డారు. ఈ స్టార్‌డమ్ ఆమెకు రాత్రికి రాత్రి వచ్చింది కాదు.. దీని వెనుక ఎన్నో ఏళ్ల శ్రమ, త్యాగాలు ఉన్నాయి. ఆగస్ట్ 13, 1963న తమిళనాడులోని శివకాశీలో జన్మించారు శ్రీదేవి. ఆమె అసలు పేరు అమ్మయ్యంగార్ అయ్యప్పన్. తొలుత బాలనటిగా నటించిన శ్రీదేవి.. 1976లో హీరోయిన్‌గా నటించారు. కే బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్, రజనీకాంత్‌లతో కలిసి మాండ్రు ముడిచులో నటించారు.

Bollywood Legendary Actress Sridevi Underwent 29 Surgeries To Look beauty

బాలీవుడ్‌ను ఊపేసిన శ్రీదేవి
ఇక తెలుగులో అయితే ఆమె స్టార్ డమ్ పీక్స్‌లో ఉండేది. అగ్రనటులు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజులతో కలిసి పదుల చిత్రాల్లో నటించారు. ఆ తర్వాతి తరం చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లతోనూ శ్రీదేవి ఆడిపాడారు. సౌత్‌ను ఒక ఊపు ఊపుతున్న దశలో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి రాజేష్ ఖన్నా, ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, జితేంద్ర వంటి సూపర్‌స్టార్స్‌తో నటించి తన అందచందాలు, నటనతో హిందీ ప్రేక్షకులను అలరించారు. 1996లో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ను పెళ్లాడారు శ్రీదేవి. ఈ దంపతులకు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ సంతానం. కెరీర్‌లో ఎన్నో అవార్డులు అందుకున్న శ్రీదేవిని భారత ప్రభుత్వం 2013లో పద్మశ్రీతో సత్కరించింది.

శ్రీదేవి మరణంతో ఇండస్ట్రీ షాక్
వివాహం తర్వాత కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చినప్పటికీ ఇంగ్లీష్ వింగ్లీష్‌తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి హిట్ కొట్టారు. మరిన్ని చిత్రాల్లో నటించేందుకు సన్నాహాలు చేస్తుండగా బంధువుల పెళ్లి వేడుక నిమిత్తం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న హోటల్ బాత్‌టబ్‌లో పడి ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. ఆమె హఠాన్మరణంతో దేశ ప్రజలు ఉలిక్కిపడ్డారు. అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. శ్రీదేవి మరణానికి కారణాలపై రకరకాల వాదనలు తెరపైకి రాగా.. వాటిని కుటుంబ సభ్యులు ఖండించారు. శ్రీదేవి జీవితంపై ది లైఫ్ ఆఫ్ ఏ లెజెండ్ పేరుతో పుస్తకం కూడా రానుంది.

Take a Poll

అందానికి ప్రాధాన్యత
ఇదిలాఉండగా.. సూపర్‌స్టార్‌గా, అతిలోకసుందరిగా తన అందాన్ని కాపాడుకోవడానికి శ్రీదేవి ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారని సినీ జనాలు ఇప్పటికీ చెప్పుకుంటారు. అయితే ఆమె తన జీవితంలో ఏకంగా 29 శస్త్రచికిత్సలు చేయించుకున్నట్లుగా పుకార్లు కూడా ఉన్నాయి. ముక్కు, పెదాలతో పాటు లేజర్ స్కిన్ సర్జరీ, సిలికాన్ బ్రెస్ట్ ట్రీట్‌మెంట్, ఫేస్ లిఫ్ట్ వంటి సర్జరీలు ఉన్నాయట. అంతేకాదు మరణానికి కొద్దిరోజుల ముందు కూడా శ్రీదేవి లిప్ సర్జరీ చేయించుకున్నారని అప్పట్లో బీటౌన్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ ఈ న్యూస్ మాత్రం ఇప్పటికీ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Read more about: sridevi movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X