వయసేమో 38.. వయ్యారాలు మాత్రం 16.. బ్లూ కలర్ మోనోకినిలో నాగిన్ బ్యూటీని గుర్తించారా?
డబ్బింగ్ సీరియల్ నాగిని తో పాపులారిటీ దక్కించుకున్న మౌనీరాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై టీవీ షోలు, సీరియళ్లలో సందడి చేసిన మౌనీ రాయ్... ఇప్పుడు సోషల్ మీడియాలోనూ సత్తా చాటుతోంది. తన గ్లామర్ షోతో కుర్రకారు హీటెక్కిస్తూ రచ్చ చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లూ కలర్ మోనోకిని డ్రెస్ వేసుకుని సోకులు ఆరబోసింది. అందులో యమా హాట్ గా కనిపిస్తుండగా.. అంతా ఫిదా అయిపోతున్నారు. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అభిషేక్ బచ్చన్ రన్ సినిమాలో స్పెషల్ సాంగ్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తుమ్ బిన్ 2, గోల్డ్ చిత్రాలతో పాటు కేజీఎఫ్ లోనూ స్పెషల్ సాంగ్ లో చేసింది. తాజాగా బ్రహ్మాస్త్ర సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించి మెప్పించింది. సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ హాట్ బ్యూటీ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలతో పాటు పర్సనల్ విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఎక్కువగా గ్లామర్ షో చేసే ఈ ముద్దుగుమ్మ కుర్రకారుకు ఎప్పుడూ హీటెక్కిస్తుంది.

తన అద్భుతమైన అందాలను ఆరబోస్తూ అందరినీ కట్టిపడేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఓ బ్లాక్ బికినీ వేస్కొని ఫొటో షూట్ చేసింది. ఆ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. స్టన్నింగ్ స్టిల్స్ తో అందాల విందులో నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంటోంది. ముఖ్యంగా బ్లూ కలర్ మోనోకిని డ్రెస్ వేసుకుని నడుము అందాలు చూపిస్తూ రచ్చ చేస్తోంది. నయాగార ఫాల్స్ లా నడుమును తెగ తిప్పేస్తూ... హాట్ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫొటోలు చూసిన అభిమానులు లైకులు, షేర్లు, కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ఫొటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే నాలుగు లక్షలకు పైగా లైకులు వచ్చాయి. వేలల్లో కామెంట్లు వచ్చాయి.

చాలా హాట్ గా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. నీ అందాన్ని తట్టుకోలేక పోతున్నామని అంటున్నారు. అయితే హాట్ బ్యూటీ అందాలను వీక్షించేందుకు మిలియన్ల కొద్దీ ఈమెను ఫాలో అవుతుంటారు. ఆమె కూడా నెటిజెన్లను ఏమాత్రం నిరాశ పరచకుండా తరచుగా ఫొటోలు షేర్ చేస్తూ కవ్విస్తుంటుంది. రోజురోజుకీ ఈ అందాల ముద్దుగుమ్మకు ఫ్యాన్స్ తో పాటు హాట్ నెస్ కూడా ఎక్కువైంది. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











