వార్ 2లో కియారా అద్వానీ బికినీ లుక్.. ఆమెపై బాలీవుడ్ నిర్మాత ఆ కామెంట్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు దక్కించుకుంది. నెక్ట్స్ ఈ బ్యూటీ హిందీ భాషలో రూపుదిద్దుకుంటున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం 'వార్ 2'లో నటిస్తోంది. కాగా నిన్న జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పవర్ ఫుల్ గ్లింప్స్ ను విడుదల చేశారు. ఆ గ్లింప్స్ లో కియారా అద్వానీ బికినీ లుక్ లో కనిపించి ఇంటర్నెట్ ను షేక్ చేసింది. ప్రస్తుతం ఆ యంగ్ బ్యూటీ బోల్డ్ లుక్ పై చర్చ సాగుతోంది. కియారా పెళ్లి తర్వాత కూడా ఇలాంటి సాహసం చేయడం పట్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదే క్రమంలో బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఆసక్తికరమైన కామెంట్ చేశారు.
కియారా అద్వానీ తెలుగు సినిమాలు..
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగులోనూ గుర్తుండిపోయే చిత్రాల్లో నటించింది. ముంబై, మహారాష్ట్రలో పుట్టిన ఈ బ్యూటీ హిందీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక టాలీవుడ్ లోకి ఏకంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన 'భరత్ అనే నేను' చిత్రంలో ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. అలా తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామా', 'గేమ్ ఛేంజర్' వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది.

వార్2 లో కియారా అద్వానీ లుక్ పై రచ్చ..
కియారా అద్వానీ ప్రస్తుతం భారీ చిత్రాల్లోనే నటిస్తూ బిజీగా ఉంటోంది. తన లైనప్ లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సినిమాల్లో 'వార్ 2' ఒకటి. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా తాజాగా విడుదలైన వార్ 2 గ్లింప్స్ లో ఈ స్టార్ బ్యూటీ ఏకంగా బికినీలో దర్శనమిచ్చి షాక్ ఇచ్చింది. అయితే రీసెంట్ గానే తను ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసి ఉండటంతో అభిమానులందరూ ఆమె చెప్పబోయే తీపి కబురు కోసం ఎదురు చూస్తున్న క్రమంలోనే ఆమె బికినీ లుక్ దర్శనమివ్వడంతో అందరూ షాక్ అవుతున్నారు.
కియారాపై బాలీవుడ్ నిర్మాత హాట్ కామెంట్..
వార్ 2 గ్లింప్స్ విడుదలైన సందర్భంగా నెటిజన్లు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కియారా అద్వానీ బికినీ లుక్ పై పలు కామెంట్స్ కనిపిస్తున్నాయి. కొందరు బాగుందని చెబుతున్నా.. మరికొందరు మాత్రం కియారాపై ఉన్న అభిమానంతో అలా చూడలేకపోతున్నామనే అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే క్రమంలో నిర్మాత కరణ్ జోహార్ కియారా అద్వానీ బికినీ లుక్ లో హీట్ పెంచేసిందంటూ కామెంట్ చేయడం హాట్ టాపిక్ గ్గా మారింది. మరోవైపు హృతిక్ రోషన్, జూ ఎన్టీఆర్ పైనా కూడా కరణ్ జోహార్ ప్రశంసలు కురిపించి ఆకాశానికి ఎత్తారు.
ప్రెగ్నెన్సీతో కియారా అద్వానీ..
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ కియారా అద్వానీ స్టార్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాను లవ్ మ్యారేజ్ చేసుకుంది. 2023లో వీరి వివాహాం రాజస్థాన్ లో హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగింది. ఇక 2025 ఫిబ్రవరిలో కియారా అద్వానీ తన ప్రెగ్నెన్సీని ప్రకటించడం విశేషం. ఈ బ్యూటీఫుల్ దంపతులకు పుట్టబొయే బిడ్డ కోసం అభిమానులు, శ్రేయోభిలాషులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











