Kangana Ranaut: ప్రభాస్‌తో దానికి రెడీ అంటున్న బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమె ప్రస్తుతం చంద్రముఖి 2 చిత్రంలో నటిస్తుంది. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మూవీ మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇక ఈ ప్రెస్ మీట్ పాల్గొన్న కంగనా ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఛాన్స్ వస్తే.. ఏక్ నిరంజన్ 2 లో నటిస్తానని వెల్లడించింది. ఇక ప్రభాస్ గురించి ఏం చెప్పిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బాలీవుడ్ ఫైర్ బ్రాండుగా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్... తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. బాలీవుడ్ లో ఎప్పుడూ వివాదాల్లో ముందుండే ఈ భామ.. తాజాగా చంద్రముఖి 2 సినిమాలో నటిస్తుంది. సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన చంద్రముఖి సినిమాకు ఇది సీక్వెల్. ఇక ఈ సీక్వెల్ లో జ్యోతిక చేసిన పాత్రలో కంగనా నటిస్తుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ సహా హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కానుంది.

Bollywood Queen Kangana Ranaut Intresting Comments on Prabhas in Chandramukhi 2 Movie Promotions

ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో .. చిత్ర బృందం ప్రమోషన్స్ మొదలు పెట్టింది. అందులో భాగంగానే హైదరాబాద్ లో మూవీ మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో కంగనా రనౌత్ తో పాటు హీరో రాఘవ లారెన్స్ కూడా పాల్గొన్నారు. ఇక మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేశారు. ఇందులో తెలుగు ఫిల్మీబీట్ ఎడిటర్ రాజాబాబు కంగనా రనౌత్ ను పలు ప్రశ్నలను అడిగారు. దానికి కంగనా సమాధానాలు చెప్పుకొచ్చింది.

అయితే ప్రభాస్ హీరోగా, పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఏక్ నిరంజన్. ఈ చిత్రం 2009లో రిలీజ్ అయింది. ఇక ఇందులో హీరోయిన్ గా కంగనా నటించింది. ఈ సినిమా ద్వారానే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సీనిమా సీక్వెల్ గురించి కొన్ని ప్రశ్నలు అడగ్గా.. దానికి కంగానా.. కచ్చితంగా సీక్వెల్ లో చేస్తానని చెప్పుకువచ్చింది.

Bollywood Queen Kangana Ranaut Intresting Comments on Prabhas in Chandramukhi 2 Movie Promotions

ఇక ఏక్ నిరంజన్ మూవీ టైమ్ లో ప్రభాస్ తనతో సరదాగా గడిపినట్లు వెల్లడించింది. అప్పుడు ప్రభాస్‌, తాను చాలా యంగ్‌ ఏజ్‌ లో ఉన్నామని అల్లరి చిల్లరగా ఉండేవాళల్లమని చెప్పుకువచ్చింది. సెట్‌లో చాలా ఛిల్‌ అయ్యేవాళ్లమని.. అంతే కాదు.. ఒకరినొకరం సెట్లో టీజింగ్‌ కూడా చేసుకున్నట్టు బయటపెట్టింది. అప్పుడు యంగ్ గా ఉండే వాళ్లం... ఇప్పుడు ప్రభాస్ మారిపోయారు.. గ్లోబర్ స్టార్ అయ్యారని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Bollywood Queen Kangana Ranaut Intresting Comments on Prabhas in Chandramukhi 2 Movie Promotions

ఇక ఏక్ నిరంజన్ 2 సినిమా చేస్తే.. తాను చేయడానికి సిద్ధమని వెల్లడించింది. సౌత్‌ లో నటించేందుకు తాను ఆసక్తికరంగా ఉన్నానని.. ఇక్కడి సినిమాలు చేయాలని ఉందని చెప్పింది. ఇక చంద్రముఖి 2 గురించి చెప్తూ.. జ్యోతిక పాత్రను బీట్ చేయడం కష్టమేనని వెల్లడించింది. చంద్రముఖి2 సినిమాకు వాసు దర్శకుడు. రాఘవ లారెన్స్, కంగనా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా పిక్చర్స్ నిర్మించింది. ఈ నెల 28న సినిమా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X